BigTV English

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Malaika Arora: 51 ఏళ్ల వయసులో రెండో పెళ్లి… నేను రొమాంటిక్ అంటున్న నటి!

Malaika Arora: సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకోవడం బ్రేకప్ చెప్పుకోవడం తిరిగి రెండో పెళ్లి చేసుకోవడం అనేది సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ఇలా రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకొని వార్తల్లో నిలిచారు. మరి కొంతమంది విడాకులు తీసుకొని రెండో పెళ్లికి సిద్ధమవుతున్న వారు కూడా ఉన్నారు. ఇలాంటి కోవకు చెందిన వారే బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా(Malaika Arora) అని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఇదివరకే పెళ్లి చేసుకొని తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.


రెండో పెళ్లికి సిద్ధమైన మలైకా…

మలైకా అరోరా నటుడు అర్బాజ్ ఖాన్ (Arbaaz Khan)ను మొదట వివాహం చేసుకున్నారు. ఈ దంపతులు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపారు. వీరికి ఒక కుమారుడు కూడా జన్మించారు. ఇలా సంతోషంగా సాగిపోతున్న తమ వైవాహిక జీవితంలో వచ్చిన బేదాభిప్రాయాల కారణంగా 2017 వ సంవత్సరంలో విడాకులు (Divorce)తీసుకుని విడిపోయారు. ఇలా విడాకుల తర్వాత మలైకా తన కంటే వయసులో చిన్నవాడైన నటుడు అర్జున్ కపూర్(Arjun Kapoor) తో చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు జంటగా కనిపించడంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ వీరి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఇకపోతే తాజాగా మలైకా తన రెండో పెళ్లి(Second Marriage) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ప్రేమ పై నాకు నమ్మకం ఉంది…

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ..”నేను హార్డ్ కోర్ రొమాంటిక్ పర్సన్. ప్రేమ పై నాకు ఎంతో నమ్మకం ఉంది సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా తాను సిద్ధమేనని” వెల్లడించారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు చేసుకుంటున్న యువతి యువకులు పెళ్లి విషయంలో ప్రతి ఒక్కటే ఆలోచించి పెళ్లి చేసుకోవాలని సలహా ఇచ్చారు. నాకు చిన్న వయసులోనే పెళ్లి జరిగింది. అయితే తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత అందరూ నన్ను స్వార్థపరురాలిగా చూశారు కానీ విడాకుల తీసుకోవడంలో కూడా నేను నా ఆనందాన్ని వెతుక్కున్నానని తెలిపారు.

కెవ్వు కేక అంటూ మెప్పించిన మలైకా…

ఇలా 51 సంవత్సరాల వయసులో ఈమె సరైన వ్యక్తి దొరికితే రెండో పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈమె రెండో పెళ్లి తన రూమర్ద్ బాయ్ ఫ్రెండ్ అర్జున్ కపూర్ తో జరుపుకుంటారా? లేదంటే తన ఇస్తా ఇష్టాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తి దొరికినప్పుడు పెళ్లి చేసుకుంటారా అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు కానీ రెండో పెళ్లి మాత్రం చేసుకుంటానని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మలైకా స్పెషల్ సాంగ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఇక తెలుగులో కూడా ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమాలో కెవ్వు కేక అంటూ సాగే పాటలు తన డాన్స్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే.

Also Read: Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

Related News

Tollywood Producer: ఒకేసారి 15 సినిమాలకు కమిట్ అయిన నిర్మాత.. రికార్డుల కోసం రిస్క్ అవసరమా?

Ram Gopal Varma: నాన్న జన్మనిస్తే.. నాగార్జున రెండో జీవితాన్ని ఇచ్చారు.. వర్మ ఎమోషనల్ !

Kollywood: ధనుష్ చెల్లెలిగా స్టార్ హీరోయిన్.. ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారా?

Pawan Kalyan: మీరు మా పెద్దన్న.. స్టార్ హీరోపై పవన్ కళ్యాణ్ ట్వీట్!

Manam Movie: ఐసీయూ బెడ్ మీద నుంచి  ఆ సినిమా డబ్బింగ్ చెప్పిన హీరో… ఇది కదా డెడికేషన్ అంటే?

Big Stories

×