RK Roja: ప్రముఖ టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా గురించి అనంతరపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. ఆ ఆడియో కాల్ లో ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ పట్ల బూతులు మాట్లాడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమాను అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్..
అయితే ఆ వీడియో తెగ వైరల్ కావడంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. తమ హీరోను బూతులు తిడుతారా..? సినిమాను ఆపేందుకు ప్రయత్నం చేస్తారా..? అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆ ఆడియో కాల్ పై ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ రియాక్ట్ అయిన విషయం కూడా తెలిసిందే.
క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే..
కొంత మంది కావాలనే ఉద్దేశపూర్వకంగానే తనపై కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే స్పందించారు. ఆ కుట్రలో భాగంగానే ఈ ఆడియో బయటకు వచ్చిందని ఆయన చెప్పారు. తాను జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అందుకు గానూ తను క్షమాపణలు కూడా చెబుతున్నానని తెలిపారు. అయితే నాలుగు గోడల మధ్య క్షమాపణలు చెబితే సరికాదని.. బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ పార్టీ కార్యాలయం ముందు కూర్చొని ధర్నాకు కూడా దిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనపై వైసీపీ నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా రియాక్ట్ అయ్యారు.
ALSO READ: National Highway: రూ.11వేల కోట్లతో నేషనల్ హైవే.. 20 నిమిషాల్లోనే ఎయిర్ పోర్టుకు..!
రోజా కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అలా మాట్లాడడంపై రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉన్నారని.. ఆయన సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారని చెప్పారు. ఆయన సినిమాలను అడ్డుకుంటామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ సినిమాలను అడ్డుకునే దమ్ము ఎవరికీ లేదని ఆమె ఫైరయ్యారు. సినిమాలో కంటెంట్ బాగుంటే వాటిని ఆపటం ఎవరి తరం కాదని అందుకు అభిమానులే సాక్ష్యమని చెప్పారు. రాజకీయాలు, సినిమాలు ఒకటి కావని.. ఆ రెండింటిని దయచేసి ఒకటి చేయవద్దని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాదంపై స్పందించకపోవడం గమనార్హం.
ALSO READ: Vizag Rainfall: మరో 3 రోజుల వర్షాలు.. విశాఖ వాసులకు టెన్షన్ పెంచుతున్న వాతావరణం!