Fahadh Faasil : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ పుష్ప.. నేషనల్ వైడ్ గా పేరు తెచ్చిపెట్టిన మూవీ ఇదే.. ఈ మూవీలో అల్లు అర్జున్ కి పోటీగా విలన్ పాత్రలో నటించిన నటుడు ఫహద్ ఫాజిల్. మలయాళ నటుడు ఆయన ఈయన ఈ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నాడు. షేకావత్ గా నటించిన ఈయన ఈ సినిమాతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఆ తర్వాత సీక్వెల్ గా వచ్చిన సినిమాల్లో కూడా ఈయన నటించి తన నటనతో మెప్పించారు. ఈమధ్య బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తున్న ఫాజిల్ తాజాగా ఓ ఖరీదైన కారుని కొన్నారు.. ఆ కారు ప్రత్యేకతలు ధర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఆలస్యం ఎందుకు ఆ లగ్జరీ కారు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూసేద్దాం..
పుష్పలో విలన్ గా అందరిని ఆకట్టుకున్న ఈయన రెమ్యూనరేషన్ విషయంలో నో కాంప్రమైజ్ అంటాడు. భారీగా పారితోషకం తీసుకుంటున్న ఈయనతో సినిమాలు చేయాలని దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఫహద్ ఇప్పుడు ఒక్కో సినిమాకు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోలలో ఒకరు. ఆ స్టార్ హీరో తాజాగా వార్తల్లో నిలిచారు.. ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఆ కారు ఫెరారీ SUV పురోసంజ్వా కారు.. ఈ కంపెనీ నుంచి వచ్చిన అత్యాధునిక ప్రత్యేకతలు కలిగిన కారు ఇదే. ఈ కారు ఖరీదు దాదాపు 14 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఈ కారు వేగం, లగ్జరీ ఫీచర్స్ అన్ని అత్యంత ప్రత్యేకం. ఇప్పటివరకు తమిళ హీరో విక్రమ్, ముఖేష్ అంబానీ వంటి స్టార్స్ ఈ కొనుగోలు చేశారు.. మలయాళంలో మొదటగా కొనుగోలు చేసింది ఈయనే కావడం విశేషం. ఈయన గ్యారేజ్ లో ఇప్పటికే ఖరీదైన కార్లు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మరోకారు చేరింది.
Also Read: అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..
గత ఏడాది పుష్ప 2 తో బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు. ఫహద్ ఫాసిల్ తాజా చిత్రం ‘ఒడుం కుతిరా చదుం కుతిరా’ థియేటర్లలో రిలీజ్ అయింది. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో బ్యూటిఫుల్ హీరోయిన్ కళ్యాణీ ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. రేవతి పిళ్లై, లాల్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి, అనురాజ్, వినీత్ వాసుదేవన్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం అందిస్తున్నారు. తెలుగులో ఓ రెండు సినిమాలకు సైన్ చేసినట్లు సమాచారం.. అలాగే మలయాళంలో కూడా ఆయన వద్దకు మూడు స్టోరీలు వచ్చినట్లు తెలుస్తుంది. అవి ఆయనకు బాగా నచ్చాయి. వాటి గురించి పూర్తి వివరాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.