BigTV English

Kotha Lokah : అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..

Kotha Lokah : అనుష్క, కీర్తి సురేష్‌ను దాటేసిన కళ్యాణీ ప్రియదర్శణ్… ఒక్క సినిమాతో నెంబర్ ప్లేస్..
Advertisement

Kotha Lokah : సౌత్ సినీ ఇండస్ట్రీలో భారీ యాక్షన్ చిత్రాలు మాత్రమే కాదు.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.. కొన్ని సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాయి. తెలుగులో ఇప్పటివరకు వచ్చిన కొన్ని సినిమాల రికార్డ్ ను రీసెంట్ గా వచ్చిన మలయాళీ చిత్రం ‘కొత్త లోక 1: చంద్ర’ తుడిచిపెట్టేసింది. అద్భుతమైన స్టోరీతో ఆడియన్స్ ను కట్టిపడేసింది. కేవలం సినిమా స్టోరీ బాగుండడం మాత్రమే కాదు అటు కలెక్షన్లు భారీగా వసూల్ చేసింది.. ఇక ఆలస్యమెందుకు ఇప్పటివరకు సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలు ఏవి? అవి సాధించిన కలెక్షన్లను ఒకసారి తెలుసుకుందాం..


అరుంధతి..

టాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం అరుంధతి.. అరుంధతి 2009 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా. అనుష్క, సోనూ సూద్, అర్జన్ బజ్వా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా వసూళ్ళతో పాటు ఏడు విభాగాల్లో రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలని అందుకుంది.. ఈ మూవీ 68 కోట్లను వసూల్ చేసింది.


భాగమతి..

టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన మరో లేడీ ఓరియంటెడ్ చిత్రం భాగమతి.. జి. అశోక్ దర్శకత్వంలో 2016 డిసెంబర్ 22న విడుదలైన తెలుగు, తమిళ సినిమా. ఈ చిత్రాన్ని హిందీలో దుర్గామతి గా రీమేక్ చేశారు. ఇందులో భూమి పెడ్నేకర్ అనుష్క పాత్రలో నటించింది.. ఈ మూవీ అరుంధతి అంతా ఆకట్టుకోలేదు కానీ పర్వాలేదని టాక్ ని మాత్రం సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఫైనల్ గా 64 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

రుద్రమదేవి..

హీరోయిన్ అనుష్క నటించిన మరో చిత్రం రుద్రమదేవి.. 2015 లో గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శివ కుమార్ శ్రీపాద, కృష్ణంరాజు, దగ్గుబాటి రానా, విక్రమ్ జీత్ విర్క్, ప్రకాశ్ రాజ్, ఆదిత్య మెనన్, నిత్య మెనన్, బాబా సెహగల్, కాథరీన్ థ్రెసాలతో కూడిన భారీ తారాగణం చిత్రంలో ఉంది. ఈ మూవీ గతంలో వచ్చిన అనుష్క చిత్రాల రికార్డులను తుడిచి పెట్టేలా 80 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

మహానటి..

అలనాటి సినీ తార సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి.. టాలీవుడ్‌లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లిస్ట్‌లో మ‌హాన‌టి టాప్ ప్లేస్‌లో ఉంది. కీర్తిసురేష్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ 86 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.. ఇప్పటివరకు ఈ సినిమానే టాప్ లో ఉంది.

Also Read : 50 రూపాయల కోసం ఆ పని.. కన్నీళ్లు తెప్పిస్తున్న యాక్టర్ వశిష్ఠ రియల్ లైఫ్..

కొత్త లోక 1: చంద్ర.. 

మలయాళీ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శిని నటించిన లేటెస్ట్ చిత్రం కొత్త లోక 1: చంద్ర..ఇండియాలోనే ఫస్ట్ లేడీ సూపర్ హీరో మూవీ అని మేకర్స్ చెబుతున్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఈ చిత్రాన్ని మలయాళంలో నిర్మించారు. ఈ సినిమా ఓనమ్ కానుకగా మలయాళంలో ఆగస్ట్ 28వ తేదీ విడుదలైంది. ఇతర భాషల్లో కాస్తంత ఆలస్యంగా 30న రిలీజైంది. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన కేవలం ఆరు రోజుల్లోనే 93 కోట్లు వసూలు చేసి సరికొత్త రికార్డుని నెలకొల్పింది.. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో వచ్చిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.. కేవలం ఆరు రోజులని 100 కోట్లకు చెరువులో ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద జోరును కొనసాగిస్తుంది. చూస్తుంటే మరికొద్ది రోజుల్లోనే 1000 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోనవసరం లేదు..

Related News

Peddi Movie: చరణ్ బర్త్ డేకి బిగ్ అనౌన్స్ మెంట్.. పెద్దిపై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Shivaji: సాంప్రదాయినీ.. సుప్పినీ.. సుద్దపూసనీ అంటున్న శివాజీ

Nara Rohith : నారా రోహిత్ పెళ్లికి ఎన్టీఆర్ కు ఆహ్వానం అందిందా..? గెస్టులు వీళ్లే..

Sharwandh36 Title: శర్వా 36 మూవీ టైటిల్ ఫిక్స్.. ‘బైకర్‘గా వస్తున్న ఛార్మింగ్ స్టార్

Samantha : సినిమాలు లేకున్నా నంబర్ వన్ స్థానం.. సమంత రేంజ్ మామూలుగా లేదుగా!

Pradeep Ranganathan : డైరెక్టర్ టు హీరో జర్నీ.. ప్రదీప్ రంగనాథన్ సంపాదించిన ఆస్తులు ఇవే..?

Bandla Ganesh: రూ. 2 కోట్ల పార్టీ.. బండ్ల ప్లాన్ సక్సెస్ అయ్యిందా.. ?

Bandla Ganesh: దీపావళి పార్టీ కోసం బండ్లన్న పెట్టిన ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×