Venktesh Joins Soon in MSG Shooting: మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారూ‘. పండక్కి వస్తున్నారు అనేది ట్యాగ్ లైన్. ప్రకటనతోనే ఈ మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది. మెగాస్టార్తో అనిల్ రావిపూడి చిత్రం అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా మూవీ గ్లింప్స్తో పాటు టైటిల్ని ప్రకటించారు. ఈ గ్లింప్స్లో చిరు లుక్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంది.
చిరు అసలు పేరుతో మూవీ టైటిల్ ఉండటంతో అనిల్ రావిపూడి ఎదో పెద్ద ప్లానే వేశారని, మన శంకర వరప్రసాద్తో ఫ్యాన్స్కి మెగా ట్రీట్ని సిద్దం చేస్తున్నారని నమ్ముతున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో టాలీవుడ్ స్టార్ హీరో కూడా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరి వెంకటేష్ అతిథి పాత్రలో మెరవనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడే ప్రకటించారు. దీంతో వెంకటేష్ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతారా? అని అభిమానులంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వెంకీమామ ఎంట్రీపై తాజాగా నిర్మాత సాహు గారపాటి అప్డేట్ ఇచ్చారు.
కిష్కంధపూరి మూవీ ఈవెంట్లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారూ మూవీ గురించి ప్రస్తావించారు. షూటింగ్ అప్డేట్తో పాటు వెంకటేష్ ఆగమనం ఎప్పుడో చెప్పారు. ఈ నెల 5(సెప్టెంబర్ 5) తేదీ నుంచి మన శంకర వరప్రసాద్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలు కానుందని తెలిపారు. ఈ షెడ్యూల్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ నెల చివరి వరకు ఉంటుందన్నారు. వచ్చే నెల అంటే అక్టోబర్లో జరిగే షూటింగ్ షెడ్యూల్లో వెంకటేష్ జాయిన్ అవుతారని స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్, వెంకటేష్, చిరంజీవిలకు సంబంధించిన షూటింగ్ జరుగుతుందని చెప్పారు. దాదాపు మూవీకి సంబంధించిన టాకీ పార్ట్ దాదాపు వచ్చే నెలలోనే పూర్తవుతుందన్నారు. ఆడియో సాంగ్స్తో పాటు బ్యాలెన్స్ టాకీ పార్ట్ నవంబర్ లేద డిసెంబర్ 20లోపు పూర్తవుతుంది. ఆ వెంటనే మూవీ ప్రమోషన్స్ కూడా మొదలుపెడతామాని చెప్పారు. ఏదేమైనా వచ్చేఏడాది సంక్రాంతికి మూవీ సిద్దం చేస్తున్నామన్నారు.
పండుగ కానుకగా జనవరి 12న మూవీ విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ అప్డేట్తో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబో ఎలా ఉంటుందో చూశాం. ఇక ఈసారి చిరంజీవితో కలిసి వెంకీమామను చూపించబోతున్నాడు అనిల్ రావిపూడి. ఇక ఈ కాంబో ఏ రేంజ్ లో సెన్సేషన్ చేస్తుందో ఊహిస్తుంటేనే.. థ్రిల్ అవుతున్నారు ఫ్యాన్స్. వెంకటేష్ కోసం స్పెషల్ రోల్ డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. ఇందులో చిరంజీవి, వెంకటేష్ మధ్య హై–ఎనర్జీ సీన్స్ని డిజైన్ చేశాయి. వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ బిగ్‌స్క్రీన్ మ్యాజిక్ చేయనున్నాయట. వీరిద్దరి సన్నివేశాలకు థియేటర్లు అరుపులు, కేకలు మారుమ్రోగాల్సిందేనట. ఇప్పటికే అనిల్ రావిపూడి, వెంకీమామలది హ్యాట్రిక్ హిట్ కాంబో. ఈసారి చిరుతో కలిసి మరో బ్లాక్బస్టర్కి సిద్దమవుతున్నారంటూ సినీవర్గాల చర్చించుకుంటున్నాయి.
Also Read: MLC Kavitha: సంతోష్ రావ్.. చిరంజీవి, ప్రభాస్లను కూడా మోసం చేశాడు..