MLC Kavitha Cooments: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. సొంత పార్టీలోనే విభేదాలు తలెత్తాయి. మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రి హరీష్ రావుపై సంచలన కామెంట్స్ చేయడంతో.. అధిష్టానం ఆమెను పార్టీ నుంచి బహిష్కరించింది. రాజకీయ చరిత్రలో ఎన్నడు లేని విధంగా సొంత తండ్రి కూతురిని పార్టీ నుంచి బహిష్కరించిన సంఘటన బీఆర్ఎస్లో చోటుచేసుకుంది. నిన్న పార్టీ అధిష్టానం కవితని బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కల్వకుంట్ల కవిత నేడు మీడియా సమావేశం నిర్వహించి.. హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. వీరిద్దరు బీఆర్ఎస్ పార్టీని అస్తగతం చేసుకోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించింది.
అయితే ఈ రాజకీయ వేడీ ఇప్పుడు సినీరంగాన్ని కూడా తాకింది. తాజా మీడియా సమావేశంలో సంతోష్ రావును ఉద్దేశిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. సంతోష్ రావు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే కాదు.. సినీ హీరోలు చిరంజీవి, ప్రభాస్లను కూడా మోసం చేశారని ఆరోపించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చిరంజీవి, ప్రభాస్ వంటి సెలబ్రిటీలతో మొక్కలు నాటించారు.. కానీ, దానికి వెనక సంతోష్ రావు పెద్ద కుట్ర పన్నారని అన్నారు. వారితో మొక్కలు నాటించి.. ఆ ఆడివినే కొట్టేయాలని చూశాడని కవిత సంచలన ఆరోపణలు చేశారు. సంతోష్ రావు కూరలో ఉప్పు, చెవిలో జోరీగా లాంటి వారని, ప్రతీ పనిని చెడగొట్టడంతో ముందు ఉంటాడని కవిత విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ అటూ రాజకీయాలు, ఇటూ ఇండస్ట్రీలో మారాయి.
Also Read: Mirai First Review: సెకండాఫ్‌లో బోరింగ్ సీన్స్… ఫైనల్ రిజల్ట్ ఏంటంటే ?