Manchu Lakshmi: మంచు లక్ష్మీ (Manchu Lakshmi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా మూవీ దక్ష (Daksha).. ఈ మూవీ మరో రెండు రోజుల్లో థియేటర్లో విడుదల కాబోతుండడంతో సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పంచుకుంటోంది. అంతేకాదు సినిమా బాధ్యత మొత్తం తన భుజాలపై మోస్తోంది నటి మంచు లక్ష్మీ. అలా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మీ ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులపై జరిగే అన్యాయంపై నోరు విప్పింది.
మంచు లక్ష్మీ ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “చాలామంది మన తెలుగు వాళ్ళు పాన్ ఇండియా నిర్మాతలుగా.. డైరెక్టర్లుగా.. హీరోలుగా.. మారారు. అందుకు చాలా సంతోషం. కానీ మన తెలుగు వాళ్లే తెలుగు వారికి అవకాశాలు ఇవ్వడం లేదు. తెలుగు వారిని తొక్కేస్తున్నారు. బాలీవుడ్ నుండి అమ్మాయిని తీసుకొచ్చి ఆరు నెలలు ట్రైనింగ్ ఇచ్చే బదులు ఇక్కడే ఉన్న తెలుగు అమ్మాయికి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం. ఇదొక్కటే నా బాధ..అలాగే ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఎంతోమంది కామెంట్లు చేస్తారు. అలా నాపై కూడా ఎన్నో రూమర్లు వచ్చాయి.ఎంతో మంది కామెంట్స్ చేశారు. కానీ వాటిని పట్టుకొని కూర్చుంటే లైఫ్ లో పైకి ఎదగలేము.
ALSO READ:Manchu Lakshmi: మనోజ్ రీ ఎంట్రీ వెనుక ఇంత కథ ఉందా.. మంచు లక్ష్మీ ఏమన్నారంటే?
అనసూయకు హాట్సాఫ్ చెప్పాల్సిందే..
అనసూయ పై చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తారు. ఆమెపై మామూలు ట్రోలింగ్ చేయరు. కానీ ఆమె వాటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా ముందు నిలబడింది. ఈ విషయంలో అనసూయకి హాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఒకరకంగా ఇలాంటి వాళ్లను నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాను.. అనసూయ ఒకరు చెబితే అస్సలు వినదు. తనకు నచ్చినట్టు తాను ఉంటుంది. ఎవరు ఏమైనా అనుకోని నాకు నచ్చిందే చేస్తాను. నాకు నచ్చినట్లే ఉంటాను అంటుంది. ఈ విషయంలో ఆమెకు హాట్సాఫ్ చెప్పాల్సిందే. కానీ చాలామంది బయటకు వస్తే ఏమంటారో.. ఎలాంటి మాటలు అంటారో.. అని భయపడి పరదాల వెనకే దాక్కొని తమ లైఫ్ ని నాశనం చేసుకుంటూ ఉంటారు. కానీ పరదాలు దాటి బయటికి వచ్చినవారే సక్సెస్ అవుతారు.
ఐపీఎస్ అవ్వాలనుకున్నా..
ఇలాంటి వారిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. కానీ నేను టాలీవుడ్ ఇండస్ట్రీని ఓపెన్ గానే ప్రశ్నిస్తున్నాను. ఎందుకు మీరు బాలీవుడ్ నుండి హీరోయిన్లను తీసుకువచ్చి ఇక్కడి భాష నేర్పించి ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ వారికి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా అని నా అభిప్రాయం అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.అలాగే విజయశాంతిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నానని, కానీ ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలంటే చదవాలని తెలిసి ఆగిపోయాయంటూ చెప్పుకొచ్చింది.
వారెందుకు నాకోసం కథల రాయరు?
అంతేకాదు విజయశాంతి ఆటిట్యూడ్.. యాక్టింగ్.. అంటే నాకు చాలా ఇష్టం.. ఆవిడ కూడా నాకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చింది. అలాగే కొన్ని కొన్ని పాత్రలు చూసినప్పుడు త్రివిక్రమ్, సుకుమార్ లు ఎందుకు నా కోసం అలాంటి పాత్రలు రాయడం లేదు అని నా మనసుకి అనిపిస్తుంది అంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది..