Printed Pillars: హైదరాబాద్ చారిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన నగరం. ప్రపంచ నగరాలలో భాగ్యనగరానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, గొప్పగొప్ప చక్రవర్తులు పాలించిన నగరంలో హైదరాబాద్ ఎంతో ప్రసిద్ధి చెందింది. భాగ్యనగరం ఇప్పుడు మరోసారి అందిరినీ ఆకట్టుకుంటోంది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) ప్రత్యేకించి గచ్చిబౌలి ఆట్రియమ్ మాల్ రోడ్డు నుంచి కనిపించే హైదరాబాద్ పిల్లర్లపై రంగు రంగుల మురల్స్ కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ అలాగే మన దేశానికి చెందిన క్రీడా లెజెండ్స్ ను గౌరవించే విధంగా రూపొందించారు. ఈ కళాత్మక ప్రయత్నం నగరాన్ని ఒక ఓపెన్-ఎయిర్ ఆర్ట్ గ్యాలరీగా మార్చేస్తుందని చెప్పవచ్చు.
ఈ మురల్స్‌లో ఫేమస్ క్రీడాకారుల ఫోటోలను పొందుపరిచారు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజాలు కైలియన్ మెబాప్పే, క్రిస్టియానో రొనాల్డో, నెయిమర్ జూనియర్, లియోనెల్ మెస్సీ, గావి వంటివారి రంగు రంగుల చిత్రాలు పిల్లర్లపై మెరిసిపోతున్నాయి. వీరి డైనమిక్ గేమ్ పోజ్‌లు, వినూత్న బ్రష్ స్ట్రోక్స్‌తో ఆకర్షణీయంగా దిద్దబడ్డాయి. భారతీయ క్రీడావీరుల్లో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్, యువరాజ్ సింగ్, మహ్మద్ షమీ వంటి స్టార్ల ఫోటోస్ కూడా ఉన్నాయి. మరింత ప్రత్యేకంగా.. పంజాగుట్ట సమీపంలో భారతీయ షటంజ్ గ్రాండ్‌మాస్టర్ గుకేష్ డొమ్మరాజు మురల్ ఉంది. ఈ యువ క్రీడావీరుడు తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ షటంజ్ రంగంలో భారత్‌ను గర్వపడేలా చేశాడు. ఈ మురల్స్ కేవలం చిత్రాలు కాదు, క్రీడా ఆత్మకథలా ఉంటాయి. వీరి కష్టాలు, విజయాలు, ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తాయి.
ఈ కళాత్మక ప్రయత్నం వెనుక ఎవరు ఉన్నారో కచ్చితంగా తెలియకపోయినా, ఇది సాంస్కృతిక, సృజనాత్మకను సమన్వయం చేసే ప్రణాళికగా కనిపిస్తుంది. హైదరాబాద్ చరిత్రను ప్రతిబింబించేలా.. వైవిధ్యం, సృజనశీలతను ఈ మురల్స్ అద్భుతంగా ఉన్నాయి. వాహనదారులు, ఈ పిల్లర్లను చూస్తుంటే, క్రీడా ఉత్సాహం మెరిసిపోతుంది. పిల్లర్లపై రంగులు, డిజైన్‌లు ఇంత రియలిస్టిక్‌గా ఉండటం వల్ల వాహనదారులు కూడా ఆగి చూడకుండా ఉండలేరు. ఇది నగర సౌందర్యాన్ని మరింత ఉన్నతం చేస్తూ కొత్త ఆకర్షణగా మారిందని చెప్పవచ్చు.
ALSO READ: Indian Railway Jobs: రైల్వేలో భారీగా పారా మెడికల్ ఉద్యోగాలు.. మంచి వేతనం, రేపే లాస్ట్ డేట్
సోషల్ మీడియాలో ఈ మురల్స్ తెగ వైరల్ అవుతున్నాయి. రెడ్డిట్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల్లో ఈ చిత్రాలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘హైదరాబాద్ ఇప్పుడు క్రీడా క్యాపిటల్!’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోక నెటిజన్ సచిన్ మురల్ చూసి ‘చిన్నప్పుడు అతను ఆడిన మ్యాచ్‌లు గుర్తొచ్చాయి’ అని భావోద్వేగంగా పోస్ట్ చేశారు. మరొకరు ‘గుకేష్ చిత్రం యువతకు ప్రేరణ’ అంటూ ప్రశంసించారు. ఈ మురల్స్ కు షేర్లు, లైక్‌లు లక్షల్లో పెరుగుతున్నాయి. కొందరు ‘ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు హైదరాబాద్ లో కనిపించాలి’ అని సూచించారు. ఈ స్పందనలు చూస్తే, మురల్స్ కేవలం కళలు కాదు, సమాజాన్ని ఏకం చేసే శక్తి కలిగినవని తెలుస్తుంది. హైదరాబాద్ ప్రభుత్వం, స్థానిక సంస్థలు ఈ ఇనిషియేటివ్‌ను మరింత విస్తరించాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
ALSO READ: Flipkart iPhone Offers: 2025లో ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ డీల్.. మిస్ అయితే మళ్లీ రాదు!
ఈ పెయింటెడ్ పిల్లర్లు హైదరాబాద్‌కు కొత్త గుర్తింపును ఇస్తున్నాయి. క్రీడా, కళ, సంస్కృతి సమ్మేళనంతో, నగరం మరింత జీవంతంగా మారింది. ఇది యువతకు కలలు సాకారం చేయొచ్చు అనే సందేశాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని ఉంటే, హైదరాబాద్ ప్రపంచ కళా మ్యాప్‌లో మరింత ముందుంటుంది.