TG Viswa Prasad : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతలలో టీజీ విశ్వప్రసాద్ ఒకరు. కళ్యాణ్ రామ్ నటించిన ‘ఎమ్మెల్యే’ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిర్మాతగా మారిన ఈ ఎన్ఆర్ఐ ఇప్పుడు ఇండిస్ట్రీలోనే టాప్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ఎమ్మెల్యే మూవీ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలో సినిమాలు నిర్మించడం మొదలుపెట్టారు. ప్రస్తుతం పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో దాదాపు 50 సినిమాలు పూర్తి అయ్యే స్థాయికి వచ్చాయి.
రీసెంట్‌గా మిరాయ్ మూవీ థియేటర్‌లోకి వచ్చింది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా నటించిన ఈ మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది.
మామూలుగా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు నిర్మాతకు డబ్బులు నష్టం రావడం జరుగుతుంది. అలానే హీరోలు కూడా కెరియర్ పరంగా కొంతమేరకు వెనక్కి వెళ్ళిపోతారు. అందరిని మించి డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువగా నష్టపోతారు. ఎగ్జిబ్యూటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కి జరిగిన నష్టాన్ని ఆదుకోవడానికి ఎవరు ముందుకు రారు. కొన్ని సందర్భాలలో డిస్ట్రిబ్యూటర్స్ ధర్నా చేస్తున్నట్లు వార్తలు కూడా వస్తుంటాయి. లైగర్ లాంటి సినిమాల విషయంలో ఇది జరిగడం మనం చూశాం.
మామూలుగా నిర్మాత ఒక సినిమాను కంప్లీట్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కి ఆ సినిమాను తన కావాల్సిన రేటుకు అమ్మేస్తాడు. ఒక 50 కోట్లకు 60 కోట్లకు రైట్స్ ఇచ్చేసిన తర్వాత నిర్మాత సేఫ్ జోన్ లో ఉంటాడు. కానీ, సినిమా ఫెయిల్ అయితే డిస్ట్రిబ్యూటర్ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థికంగా చితికిపోతాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి.
ఇక ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ ఒకసారి కొత్త రూట్ వేశారు. అడ్వాన్స్ బేసిస్ మీద సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే ఒక సినిమాను డిస్ట్రిబ్యూటర్ కి అమ్మేసిన తర్వాత థియేటర్ కి వచ్చే ఆడియన్స్ బట్టి డబ్బులు వస్తాయి. మిరాయి సినిమాకి సంబంధించి థియేటర్స్ కి ఆడియన్స్ వచ్చి కొనుక్కుని టికెట్ మనీలో కొంత పర్సెంట్ డిస్ట్రిబ్యూటర్ కు కొంత పర్సెంట్ నిర్మాతకు దక్కుతుంది.
ఒకవేళ సినిమా ఫెయిల్ అయితే నిర్మాత తిరిగి డబ్బులు చెల్లిస్తారు. దీనివలన డిస్ట్రిబ్యూటర్ నష్టపోవడం అనేది జరగదు. సినిమా అనేది సేఫ్ బిజినెస్ అని ఇంకొంతమంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. సినిమా పరిశ్రమ కూడా బాగుంటుంది. ప్రస్తుతం మిరాయ్ సినిమాకు ఇదే జరుగుతుంది. అలానే తర్వాత విడుదల కాబోయే రాజా సాబ్ సినిమాకి కూడా ఇలానే ఉండబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
నిజానికి ఇలా చేయడానికి ఏ నిర్మాత కూడా ముందుకు రారు. కానీ, విశ్వ ప్రసాద్ ఓన్ రిస్క్ మీద.. ఈ ఓన్ రిలీజ్ చేస్తున్నాడని చెప్పుకొవచ్చు. తేడా కొడితే వందల కోట్లు నష్టపోతాడు. ఇంతటి రిస్క్ చేస్తున్న విశ్వ ప్రసాద్‌ను చూసి డిస్ట్రిబ్యూటర్స్ మెచ్చుకోలేక ఉండిపోతున్నారు.
మొన్న ఇదే విషయాన్ని ఓ డిస్ట్రిబ్యూటర్ బయట తన సన్నిహితులతో అన్నాడు. “సినిమా చేసి, కొన్ని డబ్బులకు తమకు అమ్మేసి.. మళ్లీ అది ఎలాంటి పరిస్థితుల్లో ఉంది.. అది చచ్చిపోయిందా.. బతికిందా… అని చాలా మంది నిర్మాతలు చూడరు. నిర్మాతలకు థియేట్రికల్ రైట్స్, డిజిటిల్ రైట్స్‌తో సేఫ్ అయిపోతున్నారు. కానీ, డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచించడం మానేశారు. కానీ, ఇప్పుడు విశ్వప్రసాద్ మాత్రం డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచిస్తున్నాడు” అంటూ చెప్పాడు.
రాజాసాబ్ హిట్ అయితే, ఇప్పటి వరకు కోట్లాది రూపాయలు పొగుట్టుకున్న డిస్ట్రిబ్యూటర్స్ కొంత వరకు కోలుకునే పరిస్థితి రావొచ్చు. అదే జరిగితే, మరిన్ని సినిమాలు కొనుగోలు చేయొచ్చు. అది జరిగింది అంటే.. ఇప్పటి వరకు సంక్షోభంలో ఉన్న సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చినట్టే.
Also Read : Bigg Boss 9 Promo : కామనర్స్ మరీ ఇంత కరువులో ఉన్నారా… హౌస్‌లో అందరూ చూస్తుండగానే