Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి బద్వేలు వైపుగా వెళుతున్న కారును రాంగ్ రూట్ లో వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటన సంఘం మండలం పెరమణలో జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. అతి వేగమే దీనికి కారణం అని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.