Jio New Offers: జియో ఎప్పుడూ వినియోగదారులకు కొత్త కొత్త ఆఫర్లు, ప్రత్యేక డీల్స్, డిస్కౌంట్లతో ముందుకు వస్తూ ఉంటుంది. డేటా ప్యాక్‌లు నుంచి రీచార్జ్ ప్లాన్‌ల వరకు, వినోదం నుంచి పరికరాల వరకూ ప్రతి విభాగంలోనూ జియో ప్రత్యేక ఆఫర్లు అందిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు ఇచ్చి కస్టమర్లను ఆకట్టుకోవడంలో జియో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తోంది. ఇప్పటికీ జియో సుమారు 7 ముఖ్యమైన ఆఫర్లను అందిస్తుంది. వాటి ఉపయోగాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జియో వార్షికోత్సవ వేడుక ఆఫర్
ఇటీవల జియో తమ వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ జియో యానివర్సరీ సెలబ్రేషన్ ఆఫర్ కింద రీచార్జ్ చేసుకున్న కస్టమర్లకు అదనపు డేటా, ప్రత్యేక డిస్కౌంట్లు, ఫ్రీ సర్వీసులు లభిస్తున్నాయి. పండుగ సీజన్ లాంటి వేళల్లో ఇలాంటి ఆఫర్లు వినియోగదారులకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయి.
జియో అన్‌లిమిటెడ్ ఆఫర్
మరొక ప్రధాన ప్లాన్ జియో అనలిమిటెడ్ ఆఫర్. ఈ ఆఫర్‌లో వాయిస్ కాల్స్ ఎలాంటి పరిమితులు లేకుండా అందుతాయి. అదనంగా రోజువారీ డేటా ప్యాక్ కూడా ఉచితంగా వస్తుంది. అంటే ఒకసారి రీచార్జ్ చేస్తే కాలింగ్, ఇంటర్నెట్ రెండూ పూర్తి స్వేచ్ఛగా వాడుకునే అవకాశం దొరుకుతోంది. దీని వల్ల ఎక్కువ కాల్స్ చేసే వారు, రోజూ డేటా ఎక్కువగా వాడుకునే వారికి ఇది అద్భుతమైన ప్లాన్‌గా నిలుస్తోంది.
జియో హాట్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్
వినోదం ఇష్టపడే కస్టమర్ల కోసం జియో జియోహాట్‌స్టార్ ఎంటర్టైన్‌మెంట్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో డేటాతో పాటు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా వస్తుంది. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, క్రికెట్ మ్యాచ్‌లు, రియాలిటీ షోలు ఇవి అన్నీ ఎప్పుడైనా ఎక్కడైనా చూడవచ్చు. క్రికెట్ అభిమానుల కోసం ఈ ప్లాన్ మరింత ఆకర్షణగా మారింది.
జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్
అలాగే జియో టీవీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఈ ప్లాన్‌తో వందల కొద్దీ టీవీ ఛానెళ్లు మొబైల్‌లోనే అందుబాటులో ఉంటాయి. ఇంట్లో టీవీ లేకపోయినా, బయట ఉన్నప్పటికీ, మీ మొబైల్‌లోనే అన్ని ఛానెళ్లు చూడవచ్చు. వార్తలు, వినోదం, స్పోర్ట్స్, మ్యూజిక్ ప్రతి కేటగిరీలోనూ చానెళ్లు ఒకే ప్లాన్‌లో లభిస్తున్నాయి.
Also Read: iPhone 18 Pro: ఆపిల్ 18 ప్రో వచ్చేసింది.. ఫీచర్స్ తెలుసుకుంటే కొనాలనే కోరిక పెరుగుతుంది!
మై జియో రీఛార్జ్ ఆఫర్లు
మరొకటి మైజియో రీచార్జ్ ఆఫర్లు. ఈ అప్లికేషన్ ద్వారా రీచార్జ్ చేస్తే అదనపు క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు, ప్రత్యేక కూపన్లు దొరుకుతున్నాయి. కేవలం ఒక బటన్ నొక్కితేనే రీచార్జ్ అయ్యే సౌకర్యం, పైగా అదనపు ప్రయోజనాలు కలిసొస్తే వినియోగదారులు మైజియో యాప్ ద్వారానే రీచార్జ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.
డివైస్ బండిల్ ఆఫర్లు
డివైజ్‌లు కొనాలనుకునే కస్టమర్ల కోసం కూడా జియో ప్రత్యేక డివైజ్ బండిల్ ఆఫర్లు అందిస్తోంది. మొబైల్ ఫోన్లు, జియో ఫై పరికరాలు, సిమ్‌లు అన్నీ కలిపి ఆల్ ఇన్ వన్ ఆఫర్ కింద తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు లభిస్తున్నాయి. కొత్త ఫోన్ కొనుగోలు చేసే సమయంలో ఉచిత డేటా ప్యాక్‌లు, అదనపు సర్వీసులు కూడా ఇస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
జియోభారత్ ఫోన్
తక్కువ ధరలో స్మార్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి జియో తీసుకొచ్చిన జియో భారత్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఫోన్‌తో కేవలం కాల్స్ మాత్రమే కాదు, ఇంటర్నెట్ సదుపాయం కూడా ఉంటుంది. చాలా తక్కువ ధరలో, డేటాతో పాటు ప్రాథమిక స్మార్ట్ ఫీచర్లు లభిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది పెద్ద సహాయంగా మారింది.
బడ్జెట్‌కి తగ్గట్టుగానే అందుబాటులోకి
ఈ అన్ని ఆఫర్లతో జియో మళ్లీ ఒకసారి వినియోగదారుల కోసం విడుదల చేసి నిరూపించుకుంది కూడా, తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాలు ఇవ్వడంలో తనకు పోటీదారు లేరని. డేటా , వినోదం , టీవీ ఛానెల్లు, కొత్త ఫోన్ . ఏ అవసరం ఉన్నా జియో ప్లాన్‌లు వినియోగదారుల చేతికి దగ్గరగా, బడ్జెట్‌కి తగ్గట్టుగానే అందుబాటులో ఉన్నాయి.
ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు
అందుకే జియో ఆఫర్లను సరిగ్గా వాడుకుంటే ఖర్చు తగ్గించుకోవచ్చు, అదనపు లాభాలు పొందవచ్చు. కానీ ఒక జాగ్రత్త మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే చాలా ఆఫర్లు కేవలం పరిమిత కాలానికే ఉంటాయి. సమయానికి రీచార్జ్ చేసుకోకపోతే మళ్లీ ఆ సౌకర్యం దొరకదు. కాబట్టి వినియోగదారులు ఆలస్యం చేయకుండా తమకు సరిపడే ప్లాన్‌ను ఎంచుకుని రీచార్జ్ చేసుకోవాలి. జియో ఇచ్చే ఈ ప్రత్యేక ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్లు ఎప్పటికీ ఉండవు. ఒకసారి ముగిసిపోయాక మళ్లీ వస్తాయో రావో ఎవరికీ తెలియదు.