E-Paper
Advertisement

4 రాష్ట్రాలు. 365 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు.. విద్యార్థుల పాలిట వరంలా మంచు లక్ష్మీ !

4 రాష్ట్రాలు. 365 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు.. విద్యార్థుల పాలిట వరంలా మంచు లక్ష్మీ !

Manchu Lakshmi: నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్‌గా టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు మంచు లక్ష్మీ. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన ప్రయాణంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించిన ఆమె, ఇప్పుడు వెండితెరకు దూరంగా సమాజ సేవలో బిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా పేద విద్యార్థుల చదువు కోసం ఆమె చేస్తున్న కృషి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం గ్లామర్ ప్రపంచానికే పరిమితం కాకుండా, ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ఆమె అడుగులు వేస్తున్నారు. ..

టీచ్ ఫర్ చేంజ్.. విద్యార్థుల భవిష్యత్తు కోసం అడుగులు:

మంచు లక్ష్మి తన ‘టీచ్ ఫర్ చేంజ్’ (Teach for Change) ఫౌండేషన్ ద్వారా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తాజాగా నటుడు రాజా రవీంద్రతో చేసిన పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో ఆమె తన సేవా కార్యక్రమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గద్వాల్ జిల్లాలోని గట్టు మండలంలో సుమారు 30 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని, అక్కడి పిల్లలకు మెరుగైన విద్యను అందించే బాధ్యతను ఆమె భుజాన వేసుకున్నారు. ఇక ఇది కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, నాలుగు రాష్ట్రాల్లో విస్తరించడం విశేషం.

డిజిటల్ విప్లవం.. అదే నా లక్ష్యం:

ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ప్రాధాన్యతను గుర్తించిన మంచు లక్ష్మి, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా డిజిటల్ విద్యను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 4 రాష్ట్రాల్లో సుమారు 364 స్మార్ట్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. “నేను చేసే ఈ చిన్న సాయం వల్ల ఒక్క విద్యార్థి మారినా, ఆ ఒక్కరు తన ఊరిని బాగు చేసుకుంటారు” అని ఆమె చెప్పిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి. ఇక విద్యార్థుల్లో చదువు పట్ల ఆసక్తి పెంచితే, వారు ఉన్నత స్థితికి చేరుకుని సమాజానికి ఉపయోగపడతారని ఆమె బలంగా నమ్ముతున్నారు.

రాజా రవీంద్ర ప్రశంసలు.. నెటిజన్ల సెల్యూట్:

ఇంటర్వ్యూలో లక్ష్మి మాటలకు ముగ్ధుడైన రాజా రవీంద్ర, ఆమె చేస్తున్న సేవను చూసి చేతులెత్తి దండం పెట్టడం విశేషం. తన తండ్రి మంచు మోహన్ బాబు బాటలోనే సామాజిక స్పృహతో ముందుకు వెళ్తున్న లక్ష్మిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఏ లాభాపేక్ష లేకుండా, కేవలం పేద పిల్లల భవిష్యత్తు కోసం ఆమె చేస్తున్న ఈ పోరాటం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇక వెండితెరపై ఐరేంద్రిగా విలనిజాన్ని పండించిన ఆమె, నిజ జీవితంలో మాత్రం ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

also read:దేవర 2 ఆలస్యం వెనుక కారణం.. కొరటాల సిద్ధం.. మరి హీరో సంగతేంటి?

అంకితభావానికి నిలువుటద్దం:

మొత్తానికి మంచు లక్ష్మి కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతల్లో తన సేవా గుణాన్ని చాటుతున్నారు. విద్యా విధానంలో మార్పు తీసుకురావాలనే ఆమె సంకల్పం, వేలాది మంది పేద విద్యార్థులకు వరంలా మారింది. ఒక్క అడుగుతో మొదలైన ఆమె ప్రయాణం, నేడు వందలాది స్కూళ్లను బాగు చేసే స్థాయికి చేరింది. భవిష్యత్తులో కూడా ఆమె ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో ముందుకు సాగాలని, విద్యార్థుల జీవితాల్లో మార్పు తీసుకురావాలని కోరుకుందాం

Related News

సడన్‌గా కాంట్రవర్సీలో ఇరుక్కున్న అనుష్క శర్మ.. ఆ ఒక్క పోస్టే కారణమా?

ఆమిర్ ఖాన్ కెరీర్ బెస్ట్ క్లాసిక్ ‘లగాన్’.. 25 ఏళ్ల వేడుకగా థియేటర్లలోకి రీ రిలీజ్!

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

Big Stories

×