ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ విభాగమైన నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (NCL) భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సింగ్రౌలీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర కేంద్రంగా పనిచేసే ఈ మినిరత్న కంపెనీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 557 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పారామెడికల్ ఓవర్సీర్ హెచ్‌ఈఎంఎం విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 557
పోస్టుల వివరాలు:
మొత్తం 557 పోస్టులలో అత్యధికంగా హెచ్‌ఈఈఎంఎం (HEMM) ఆపరేటర్ ట్రైనీ విభాగానికి 472 పోస్టులు కేటాయించారు. ఇందులో డంపర్ డోజర్ గ్రేడర్ క్రేన్ పేలోడర్ సర్ఫేస్ మైనర్ వంటి ఆపరేటింగ్ పోస్టులు ఉన్నాయి. పారామెడికల్ స్టాఫ్ విభాగంలో 75 ఖాళీలు ఉన్నాయి. వీటిలో స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ టెక్నీషియన్లు ఫిజియోథెరపిస్ట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఓవర్సీర్ సివిల్ విభాగంలో 30 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హతలు: హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు హెచ్‌ఎంవీ (Heavy Motor Vehicle) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటం తప్పనిసరి. పారామెడికల్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఓవర్సీర్ పోస్టులకు సివిల్ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసి ఉండాలి.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు తగిన వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతన ప్యాకేజీలు అందుతాయి. హెచ్‌ఈఈఎంఎం ఆపరేటర్ ట్రైనీలకు రోజుకు రూ.1,502 చొప్పున చెల్లిస్తారు. పారామెడికల్ ఓవర్సీర్ గ్రేడ్-సి పోస్టులకు నెలకు రూ.47,330 వేతనం ఉంటుంది. ఇతర గ్రేడ్-డి టెక్నీషియన్ పోస్టులకు నెలకు రూ.43,775 వేతనంతో పాటు ఇతర అలవెన్సులు లభిస్తాయి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ద్వారా అభ్యర్థుల ప్రతిభను అంచనా వేస్తారు. అందులో అర్హత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిపికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180 దరఖాస్తు రుసుముగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ముఖ్యమైన తేదీలు: ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2026 ఏప్రిల్ 9న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు సమర్పించడానికి మే 1వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు. నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థలో స్థిరపడేందుకు ఇది ఒక మంచి అవకాశంగా భావించవచ్చు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nclcil.in/
ALSO READ: కొత్త ఐటీ రూల్స్.. ఉద్యోగుల పంట పండినట్లే.. వామ్మో ఎన్ని ప్రయోజనాలో..!