E-Paper
Advertisement

Manchu Manoj: కొత్త ప్రయాణం అంటూ మనోజ్ పోస్ట్.. దేని గురించి.. ?

Manchu Manoj: కొత్త ప్రయాణం అంటూ మనోజ్ పోస్ట్.. దేని గురించి.. ?
Advertisement

Manchu Manoj: మంచు మనోజ్ మిరాయ్ సినిమాతో మరో కొత్త అధ్యాయానికి నాంది పలికాడు. ఫ్యామిలీ గొడవల కారణంగా కొన్నాళ్లు  ఇండస్ట్రీకి దూరమైన మనోజ్ తన రెండో పెళ్లి తరువాత కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడు. దాంతోపాటే తన కెరీర్ ని కూడా మరోసారి సరికొత్తగా మొదలుపెట్టాడు ఈ ఏడాది భైరవం సినిమాతో రీఎంట్రీ షురూ చేసిన మనోజ్ ఆ సినిమాతో తనలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్ ని బయట పెట్టాడు. ఇక మిరాయ్ అతని జీవితాన్ని మొత్తం మార్చేసింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ఇక మిరాయ్ ఎఫెక్ట్ మనోజ్ కు మంచి అవకాశాల్ని తీసుకొచ్చి పెట్టింది.  ఈ మధ్యనే మనోజ్.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో విలన్ గా మారనున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం చిరు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే  చిరుకి వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన  డైరెక్టర్ బాబీ కొల్లి తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమాస్ యాక్షన్ సినిమా కు మిరాయ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్ గా పనిచేస్తున్న విషయం కూడా విదితమే.  ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాలతో మనోజ్ బిజీగా మారాడు. ఒకపక్క పర్సనల్ లైఫ్ ని.. ఇంకోపక్క ప్రొఫెషనల్ లైఫ్ ను సక్సెస్ గా కొనసాగిస్తున్నాడు. తాజాగా మంచు మనోజ్ మరో సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టనున్నాడు. అయితే అదేంటి అనేది మాత్రం తెలియదు.  ఎక్స్ లో మనోజ్ .. తన సరికొత్త ప్రయాణం అంటూ చెప్పుకొచ్చాడు. రేపు 11 గంటల 11 నిమిషాలకు రివీల్ చేయనున్నట్లు తెలిపాడు. జీవితం అంటే ఇవ్వడం.. తీసుకోవడం కాదు అంటూ రాసుకొస్తూ శివ పార్వతుల ఫోటోను షేర్ చేశాడు. దీంతో కొందరు కొత్త సినిమాకు సంబంధించిన న్యూస్ అని అంటుండగా.. ఇంకొందరు బిజినెస్ కి సంబంధించిన వార్త అని చెప్పుకొస్తున్నారు. మరి ఆ కొత్త ప్రయాణం ఏంటి అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×