Manchu Manoj :ఎంతో అన్యోన్యంగా ఉండే మంచు ఫ్యామిలీలో సడన్ గా మనోజ్ (Manchu Manoj)రెండో పెళ్లితో గొడవలు స్టార్ట్ అయ్యాయి.. మనోజ్.. భూమా మౌనిక (Bhuma mounika)ను రెండో పెళ్లి చేసుకోవడం మంచు ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేదు. ఒక్క మంచు లక్ష్మి (Manchu Lakshmi)కి తప్ప. దాంతో ఇంట్లో వారికి ఇష్టం లేకుండా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు మనోజ్. అయితే ఈ పెళ్లికి మోహన్ బాబు(Mohan Babu)ఫ్యామిలీ మొత్తం వచ్చారు. పెళ్లయిన కొద్ది రోజులకే మంచు ఫ్యామిలీలో ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. విష్ణు , మనోజ్ మీదికి వచ్చి దాడి చేయడం,ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. దానిపై విష్ణు క్లారిటీ ఇచ్చి మేము ఓ రియాల్టీ షో చేస్తున్నాం అని తప్పు కప్పి పుచ్చుకోవడం ఇలా ఎన్నో జరిగాయి.
అయితే అప్పటివరకు గుట్టుగా ఉన్న వీరి ఇంటి గొడవలు ఒక్కసారిగా రోడ్డు మీద పడ్డాయి. గత రెండు మూడు నెలల క్రితం మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు ఏ విధంగా ఇండస్ట్రీని షేక్ చేసాయో చెప్పనక్కర్లేదు. సామాన్య ఫ్యామిలీలలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటే ఎలా ఉంటుందో సెలబ్రిటీల మధ్య గొడవలు జరిగితే కూడా అలాగే ఉంటుంది అని మంచు ఫ్యామిలీ అన్నదమ్ములు బయటపెట్టారు. అలా గొడవలు కొట్లాటలు ఇలా ఎన్నో జరిగిపోయాయి. అంతేకాదు ఆ గొడవలు పోలీస్ స్టేషన్లు, కోర్టుమెట్లు ఎక్కేదాకా వెళ్లాయి. అలాగే సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకోవడం ఎలా ఎన్నో జరిగిపోయాయి.
also read:Prabhas in Mirai : అది డార్లింగ్ వాయిస్ కాదు.. ఎంత మోసం చేశారయ్యా ?
కట్ చేస్తే అన్న సినిమాపై మనోజ్ ప్రేమ..
కట్ చేస్తే.. సడన్గా మంచు మనోజ్ అన్న మీద ప్రేమ ఒలకబోసాడు.అది కూడా కన్నప్ప మూవీ రిలీజ్ సమయంలో.. కన్నప్ప మూవీ రిలీజ్ అయిన టైంలో కన్నప్ప చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూనే సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నారు. ఆ తర్వాత కన్నప్ప మూవీని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి బ్లాక్ బస్టర్ అనే రివ్యూ ఇవ్వడమే కాకుండా క్లైమాక్స్ లో విష్ణు పర్ఫామెన్స్ అదుర్స్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఆరోజు మనోజ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదిలా ఉంటే తాజాగా మనోజ్ నటించిన మిరాయ్ సినిమాకి మంచు విష్ణు ఆల్ ది బెస్ట్ చెప్పడం మరోసారి ఆసక్తికరంగా మారింది.
విష్ణు పోస్ట్.. మనోజ్ రిప్లై..
తేజ సజ్జా హీరోగా చేసిన మిరాయ్ మూవీలో మంచు మనోజ్ పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకి విష్ణు చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ చెప్పడంతో మనోజ్ థాంక్యూ సో మచ్ అన్నా అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో మంచు అన్నదమ్ములు వార్తల్లో హైలైట్ గా నిలిచారు. ఇన్ని రోజులు గొడవలు కొట్లాటలతో మంచు ఫ్యామిలీ వార్తల్లోకి ఎక్కింది. కానీ ఇప్పుడు ఒకరి సినిమాకి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారారు.అయితే మనోజ్, విష్ణు ఇద్దరు ఒకరి సినిమాకి మరొకరు సపోర్ట్ చేసుకోవడంతో వీరి మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతున్నాయని, త్వరలోనే ఫ్యామిలీ మొత్తం కలిసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదు మరి కొంతమందేమో అన్నదమ్ముల మధ్య గొడవలు శాశ్వతం కాదు. రక్తసంబంధీకులను ఎవరు వేరు చేయలేరు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Thank you soo much anna,
From team #Mirai alias #BlackSword https://t.co/JwG02gqPUo
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 12, 2025