Prabhas in Mirai: సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హనుమాన్’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తేజ సజ్జా(Teja Sajja).. ఇప్పుడు ‘మిరాయ్’ అంటూ ‘సూపర్ యోధ’ పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సెప్టెంబర్ 05న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. చిన్న కారణాలవల్ల సెప్టెంబర్ 12న భారీ స్థాయిలో విడుదలైంది. తేజ సజ్జా హీరోగా కార్తీక్ ఘట్టమనేని(Karthik Ghattamaneni)దర్శకత్వంలో వచ్చిన చిత్రం ఇది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ (TG Viswaprasad) నిర్మాతగా వ్యవహరించగా.. కృతి ప్రసాద్ (Krithi prasad) సహనిర్మాతగా వ్యవహరించారు. రితిక నాయక్ (Rithika Nayak) హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు(Jagapathi Babu), శ్రియా శరణ్ (Shriya Saran) తదితరులు కీలకపాత్రలు పోషించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసినప్పుడు ట్రైలర్ చివర్లో రాముడి పాత్రను చూపించారు. అప్పటినుంచి ఇందులో ఎవరు నటించబోతున్నారు అంటూ వార్తలు వైరల్ అవ్వగా.. నిన్న విడుదలైన సినిమాలో ప్రభాస్ (Prabhas )ను చూపించారు. ఫైనల్ గా ప్రభాస్ కనిపించేసరికి అభిమానులు ఆనందంతో చిందులేసినా.. అది రియల్ కాదు అని ఏఐ టెక్నాలజీని ఉపయోగించి ప్రభాస్ బొమ్మను అక్కడ ఉపయోగించారని తెలియడంతో అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేశారని చెప్పవచ్చు. ఆ తర్వాత ప్రభాస్ వాయిస్ వినిపించడంతో.. ప్రభాస్ రియల్ కాకపోతేనేమీ ఆయన వాయిస్ రియల్ కదా అని అందరూ అనుకున్నారు.
గెటప్ మాత్రమే కాదు వాయిస్ కూడా..
విషయంలోకి వెళ్తే.. సినిమా ప్రారంభంలోనే ప్రభాస్ వాయిస్ వినిపిస్తుంది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. కనీసం ఆయన గొంతునైనా వినే అవకాశం కల్పించారు అని అనుకున్నారు. కట్ చేస్తే.. ప్రభాస్ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వలేదు అని తెలుస్తోంది. ఈ వాయిస్ ఓవర్ ని కూడా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి సిద్ధం చేసినట్లు సమాచారం. మొత్తానికైతే సినిమా కోసం ప్రభాస్ నటించిన లేదు సరికదా కనీసం వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. అలా రెండింటిని కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేసినట్లు సమాచారం ప్రస్తుతం ఈ విషయాలు వైరల్ అవ్వడంతో ఎంత మోసం చేశారయ్యా అంటూ చిత్ర బృందంపై నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే ఇందులో ప్రభాస్ నటిస్తున్నాడని , ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చారని చాలామంది హైప్ క్రియేట్ చేశారు కానీ టెక్నాలజీని ఉపయోగించి ఇలా తీర్చిదిద్దారని తెలియడంతో అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మిరాయ్ సినిమా విషయానికి వస్తే..
గత కొంతకాలంగా ప్రేక్షకులలో భారీ అంచనాలు పెంచుతూ సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. ఇక్కడ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా చాలా మంది రివ్యూవర్స్ కూడా ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇస్తూ సినిమాకు మరింత హైప్ అందించారు అని చెప్పవచ్చు. ఇక హనుమాన్ కి మించిన కలెక్షన్లు ఈ సినిమాకి వస్తాయని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి
ప్రభాస్ సినిమాలు..
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ‘ది రాజా సాబ్’ సినిమాతో వచ్చే యేడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈయన.. ఆ తర్వాత ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి చిత్రాలను విడుదల చేయబోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ నటించకపోయినా.. ప్రభాస్ ఫేస్ , వాయిస్ ఉపయోగించుకొని విడుదలవుతున్న సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో ప్రభాస్ ని ఉన్నట్టు చూపించి సినిమాలు సక్సెస్ అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఈయన కదా అసలైన రెబల్ స్టార్ అంటే అంటూ కూడా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ALSO READ: Rashmika Mandanna: విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ పై రష్మిక క్లారిటీ!