Kishkindhapuri Collection : టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ కిష్కిందపురి.. గతంలో వచ్చిన భైరవం సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈసారి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు హీరో. ఇది కూడా ఆయనను నిరాశపరిచినట్లు తెలుస్తుంది. నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా జనాలను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కేవలం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. టాప్ ప్రొడక్షన్ కంపెనీ షైన్ స్క్రీన్ బ్యానర్‌పై నిర్మాత సాహు గారపాటి ఈ హారర్ర్ థ్రిల్లర్ ను నిర్మించారు.. భారీ తారాగణంతో వచ్చిన ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పాలి. అయితే మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..
ఈ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించారు. చావు కబురు చల్లగా మూవీ డైరెక్టర్ కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వం వహించారు. పీరియాడిక్, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ట్రైలర్ తో భారీ అంచనాలను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్ లోకి వచ్చిన తర్వాత యావరేజ్ టాక్ ని అందుకుంది. దాంతో కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చేసాయి. కిష్కంధపురి 4 కోట్ల గ్రాస్. 2.5 కోట్ల నెట్ కలెక్ట్ చేసింది. ఇందులో ప్రొడ్యూసర్ వాట 40 శాతం. అంటే నిర్మాత చేతికి కోటి 60 లక్షలు మాత్రమే వచ్చాయి.. ఇప్పటివరకు అయితే యావరేజ్ ఎలా ఉన్నా సినిమా టాకు ఈ వీకెండ్ ఏమైనా మారుతుందేమో చూడాలి.. వీకెండ్ గనుక కలెక్షన్లు పెరిగితే ఈ సినిమా మళ్లీ లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: ‘మిరాయ్’ కలెక్షన్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే ?
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈమధ్య భైరవం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమా యావరేజ్ టాక్ ని అందుకున్న పర్లేదు కానీ కలెక్షన్లు మాత్రం భారీగానే వసూలు చేసింది. ఇక సోలోగా ప్రస్తుతం ఆయన నటించిన కిష్కిందపురి మూవీ అనుకున్న హిట్ టాక్ ను అందుకోలేదు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని చిత్రానికి రూ.12 కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.. ఈ సినిమా మొత్తంగా కలిపి 25 కోట్లు వసూలు చేస్తే హిట్ టాక్ ని సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూస్తే అన్ని కోట్లు వసూలు చేయడం కష్టమని అనిపిస్తుంది. మరి ఈ వీకెండ్ ఏమైనా ఈ సినిమాకు అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.. ఈ హీరోకి ఈ మధ్య సరైన హిట్ సినిమా పడలేదని తెలిసిందే. ఈ సినిమా అన్న హిట్ అవుతుందని అనుకున్నారు కానీ ఇది కూడా అంత మాత్రంగానే ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ ఎలాంటి కథతో సినిమా చేస్తాడో చూడాలి…