Bhole Shavali:భోలే షావళి (Bhole Shavali).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. నిజానికి తెలుగు సినిమా పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పటికీ బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈయన.. రవితేజ (Raviteja ) హీరోగా నటించిన ‘కిక్ 2’ సినిమాలో పాటలను కంపోజ్ చేశారు. అలా బిగ్ బాస్ ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈయన ఈ మధ్యకాలంలో అటు స్టార్ మా నిర్వహించే పలు షోలతో పాటు ఇటు ఈటీవీ నిర్వహిస్తున్న షోలలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా మరొకవైపు తెలంగాణలో బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ షోలో ‘బోనాలు స్పెషల్ ‘ అంటూ ఒక ఎపిసోడ్ విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ లో తన పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టేశారు భోలే షావళి. అంతేకాదు ఇదే షోలో బంపర్ ఆఫర్ కూడా అందుకున్నారు. అందులోనూ విలక్షణ నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన విజయ్ ఆంటోనీ (Vijay Antony) మాట ఇవ్వడం జరిగింది. మరి అసలేం జరిగిందో.. విజయ్ ఆంటోనీ ఇచ్చిన మాట ఏంటి? భోలే షావళికి అది బంపర్ ఆఫర్ గా ఎలా మారింది? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో అదరగొట్టేసిన భోలే..
అసలు విషయంలోకి అయితే.. విజయ్ ఆంటోనీ కీలక పాత్రలో తన మేనల్లుడు విలన్ గా పరిచయం అవుతూ వచ్చిన చిత్రం మార్గన్ (Maargan: The Black devil). జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా అలరిస్తోంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి చిత్ర బృందంతో హాజరయ్యారు విజయ్ ఆంటోనీ. ఈ షోలో బోనాలు స్పెషల్ ఎపిసోడ్ లో భాగంగా మాస్ జాతర పర్ఫామెన్స్ తో భోలే షావళి తన టీం తో అదరగొట్టేసారు.
బంపర్ ఆఫర్ కొట్టేసిన భోలే షావళి..
ఇక ఈయన పాటకు మంత్రముగ్ధుడైన విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “భోలే షావళి నా నెక్స్ట్ మూవీలో రెండు పాటలు పాడే అవకాశం మీకు కల్పిస్తున్నాను. కచ్చితంగా మీతోనే పాడిస్తాను” అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ విషయం తెలిసి భోలే షావళి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలువురు అభిమానులు , తోటి సెలబ్రిటీలు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. విజయ్ ఆంటోనీ లాంటి బహుముఖ ప్రజ్ఞాశాలి స్వయంగా పిలిచి మరీ అవకాశం ఇవ్వడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి విజయ్ ఆంటోనీ నుండీ వచ్చే నెక్స్ట్ మూవీలో భోలే షావళికి ఏ రెండు పాటలు పాడే అవకాశం లభిస్తుందో చూడాలి.
భోలే షావళి కెరియర్..
సంగీత దర్శకుడిగా, గాయకుడిగా పేరు సొంతం చేసుకున్నారు. రవితేజ ‘కిక్ 2’ సినిమాలోని పాటలకు కంపోజ్ చేసిన ఈయన..”కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్ లో పడ్డ.. అది కాదంటే కాళ్ళ మీద పడ్డ” అనే ఒక పాటతో భారీ పాపులారిటీ అయిపోయారు. ఈ పాటతో సింగర్ గా, మ్యూజిక్ డైరెక్టర్గా కూడా గుర్తింపు సొంతం చేసుకున్నారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో మూడో వైల్డ్ కార్డు కంటెస్టెంట్గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన ఐదు వారాలు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయ్యారు.
ALSO READ:Shine Tom chacko: తండ్రి మరణం తర్వాత స్పందించిన ‘దసరా’విలన్.. సాయం కోసం రోడ్డుపై!