Viral News: ప్రేమకు హద్దులు లేవని మరోసారి నిరూపణ అయ్యింది. అదే విషయాన్ని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ జంట నిరూపించింది. కుషినగర్‌లో ఇద్దరు యువకులు ప్రేమించారు. వారిద్దరు ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. ఒకరు సర్జరీ చేసుకుని యువతిగా మారింది. చివరకు తన ప్రేమికుడ్ని వివాహం చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.
యూపీ ట్రెండ్ సెట్ చేస్తోందా? లేకుంటే ఫాలో అవుతుందా? అనేది తెలీదు. ఈ మధ్యకాలంలో రకరకాల విచిత్రాలకు కేరాఫ్‌గా మారింది ఉత్తరప్రదేశ్. ఆ మధ్య కాబోయే అల్లుడితో అత్త పారిపోయింది. ఆ తర్వాత భార్యని కోరుకున్న ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు ఆమె భర్త. ఇప్పుడు కోరుకున్న ప్రియుడి కోసం ఏకంగా లింగమార్పడి చేసుకున్నాడు ఓ అబ్బాయి.
యూపీలో కుషినగర్ ప్రాంతంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. సీతల్‌పూర్ ప్రాంతానికి చెందిన ప్రేమ్-సోను యువకులు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. చాలాకాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. ఒకరినొకరు ఉండలేక ఇద్దరు అవగాహనకు వచ్చారు. అందులో సోను లింగ మార్పిడి చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.
సోను.. చివరకు సోనియాగా మారిపోయింది. ఈ తతంగమంతా బయటకు తెలీయకుండా జాగ్రత్త పడ్డారు. చివరకు ప్రేమ్‌ను పెళ్లి చేసుకుంది సోనియా. వీరి పెళ్లి దేవాలయంలో జరిగింది. ప్రేమ్ తన ప్రియురాలు సోనియా నుదట తిలకం దిద్దాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక్కటయ్యారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
ALSO READ: లవ్ రివేంజ్.. ప్రియుడు పెళ్లి చేసుకోలేదని 11 రాష్ట్రాలను వణికించింది
రెడ్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చిన సోనియా, మోకాళ్లపై కూర్చుని ఉంది. యువకుల వివాహంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంతో రగిలిపోయారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. దేశంలో స్వలింగ వివాహం చట్టబద్ధత లేదు. రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు తన తీర్పులో స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి నిరాకరించింది.
వివాహం చేసుకునే ప్రాథమిక హక్కు లేదని తేల్చిచెప్పింది. ప్రత్యేక వివాహ చట్టంలో మార్పులు పార్లమెంటు పరిధిలోకి వస్తాయని తెలిపింది. రేపటి రోజున యూపీలో కొత్త విచిత్రం ఎలాంటిది వస్తుందేమోనని కొందరు ఆసక్తిగా గమనిస్తున్నారు.
प्यार के लिए उसने पहचान बदल दी… और समाज से टकरा गया.
उत्तर प्रदेश के कुशीनगर से सामने आई एक अनोखी प्रेम कहानी, जहां दो लड़कों को हुआ प्यार, फिर Sonu ने Gender Change कराया और Sonia बनकर अपने प्रेमी से शिव मंदिर में विवाह रचा लिया.#Love #Gender #Kushinagar #LoveStory… pic.twitter.com/s197LAFg80— State Mirror Hindi (@statemirrornews) June 24, 2025