E-Paper
Advertisement

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!

రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!
Advertisement

R.K.Roja : సినీనటి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమాలలో నటిగా కొనసాగుతున్న రోజా తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా అమ్మ పాత్రలలో కూడా కొన్ని సినిమాలలో నటించారు. అయితే ఈమె రాజకీయాల(Politics)పై ఆసక్తితో రాజకీయాల వైపు అడుగులు వేస్తూ రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకొని మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

బుల్లితెర జడ్జిగా రోజా..

ఇక గత ఎన్నికలలో రోజా(R.K.Roja) ఓటమిపాలు కావడంతో ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగులో పలు బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా కొనసాగుతూ ఉన్నారు అలాగే తమిళంలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇలా రాజకీయాలు సినీ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న రోజా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమెను ప్రశ్నిస్తూ మిమ్మల్ని చూస్తే ఒకవైపు రాజకీయాలు ,మరో వైపు సినిమాలు రెండిట్లోనూ సక్సెస్ అయ్యారనిపిస్తుంది కానీ మీకు ఎక్కడ సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది అంటూ ప్రశ్న ఎదురైంది.

సినిమాలు చేయడం పెద్దగా కష్టం ఉండదు..

Advertisement

ఈ ప్రశ్నకు రోజా సమాధానం చెబుతూ.. ఒక ఆర్టిస్టుగా నాకు డాన్స్ కానీ, నటన కానీ రాదు ఎక్కడ నేను ట్రైనింగ్ తీసుకోలేదు కానీ ఫస్ట్ మూవీ తర్వాత కొంచెం కొంచెం నేర్చుకొని మంచి సక్సెస్ అయ్యాను. ఇప్పుడు అందరూ డాన్స్ బాగా చేస్తున్నావ్ అంటే అప్పట్లో నేను తిన్న తిట్లు గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటానని రోజా తెలిపారు. ఇక రాజకీయాలతో పోలిస్తే సినిమాలు పెద్దగా కష్టం ఉండదని రోజా తెలిపారు . సినిమా అంటే మనం చేసే పనికి మనకు డబ్బులు ఇస్తారు. మనం మంచిగా చేస్తే పేమెంట్ కూడా డబుల్ అవుతూ ఉంటుంది. కానీ రాజకీయాలలో అలా కాదు మనం ఎంత చేసిన మనకు ఒక్క పర్సెంట్ కూడా అప్రిసియేషన్ అనేది ఉండదని తెలిపారు.

ఎంత మంచి చేసిన ఓటు కోసమే..

మనం రాజకీయాలలో కొనసాగుతూ ఎలాంటి మంచి పనులు చేసిన ఓటు కోసమే చేసాము అనే ముద్ర ఉంటుంది. ఇక మరోవైపు మనం మంచి చేసిన విమర్శలు చేయడానికి వ్యతిరేక పార్టీ లేదంటే, కులం పరంగా కొంతమంది ఉంటారని రోజా తెలిపారు. మనం రాజకీయాలలో ఎంత చేసిన కొంతమంది విమర్శిస్తూనే ఉంటారు. సినిమాలలో ఉన్నప్పుడు అదే రోజా, అదే క్యాస్ట్ కానీ అక్కడ అప్రిసియేషన్ ఉండేది కానీ రాజకీయాలలో అది ఉండదని తెలిపారు. సినిమాలు చాలా ఈజీ, కానీ రాజకీయాలు చాలా టఫ్ అని రోజా తెలిపారు. సినిమాలోకి అయినా, రాజకీయాలోకి అయిన నాకు ఇష్టం లేకుండానే వచ్చాను కానీ రెండు చోట్ల సక్సెస్ అయ్యానని రోజా తెలిపారు. ఇలా రాజకీయాల గురించి సినిమాల గురించి ఈమె మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో రోజు ఇన్ని రోజులకు రియాలిటీ లోకి వచ్చారా? అంటూ పలువురు ఈమె వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Also Read: నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?

Related News

గ్లింప్స్‌తోనే కథపై క్యూరియాసిటీ పెంచేసిన ‘వెట్టువం’.. ఇదేం కాన్సెప్ట్ రా బాబు!

నాని జడల వెనుక ఇంత స్టోరీ ఉందా? లుక్ కోసం కాదా?

కొత్త ఫోన్ కోసం క్యూ కట్టడం ఏంటీ? ఐ ఫోన్ లవర్స్ కు క్లాస్ పీకిన సోనూ సూద్!

ప్యారడైజ్ కోసం నాని రెమ్యూనరేషన్ తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

అల్లు అర్జున్ కు సంబంధం లేదు.. భూ వివాదంపై మామ చంద్రశేఖర్ రెడ్డి క్లారిటీ!

రోజాని అలా చూసి చాలా హర్ట్ అయ్యా.. ఆమని కామెంట్స్ వైరల్!

జాంబీ రెడ్డి 2 నుండి ఉపేంద్ర ఫస్ట్ లుక్ రిలీజ్.. ప్రపంచమే తలకిందులు కాబోతోందా?

Big Stories

Advertisement
×