Actress:ఇటీవల కాలంలో సినిమాలు అంటే తప్పనిసరిగా ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉంటేనే వాటికి ప్రేక్షకాదరణ దక్కుతుంది. లేకపోతే ప్రేక్షకులు సినిమాలు చూడటానికి పెద్దగా ఇష్టపడటం లేదని చెప్పాలి. ఇటీవల కాలంలో యువతను సినిమాలు ఆకట్టుకోవాలి అంటే అందులో రొమాంటిక్ సన్నివేశాలు ఉండడం తప్పనిసరి అనే విధంగా దర్శక నిర్మాతలు కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా చూస్తున్నారు. నటీనటులకు కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించడం సర్వసాధారణంగా మారిపోయింది. అయితే కొన్నిసార్లు ఇలాంటి సన్నీ వేషాలలో నటించిన నేపథ్యంలో ఎన్నో విమర్శలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అలాంటి విమర్శలను ఎదుర్కొంటున్నారు సూపర్ మ్యాన్ నటీనటులు.
లిప్ లాక్ సీన్ లో మునిగిపోయిన నటి..
సూపర్ మ్యాన్(Super Man) ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ అమెరికన్ సినిమాని డీసీ కామిక్స్ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. జేమ్స్ గన్ (james Gunn)దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డేవిడ్ కోరెన్స్‌వెట్ (David Corenswet) సూపర్ మ్యాన్ పాత్రలో నటించి సందడి చేశారు. రాచెల్ బ్రోస్నాహన్(Rachel Brosnahan) హీరోయిన్ పాత్రలో నటించారు. తాజాగా ఈ సినిమాలోని ఒక సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో భాగంగా హీరో హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. అయితే ఈ సీన్ చేసేటప్పుడు దర్శకుడు కట్ చెప్పిన కూడా హీరోయిన్ రాచెల్ బ్రోస్నాహన్ హీరోకు అదేవిధంగా ముద్దులు పెడుతూ ఉన్నటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
Married actress Rachel Brosnahan, who played Lois in Superman, is going viral for kissing David Corenswet after the director called cut, suggesting a moment of genuine chemistry or comfort between the actors
pic.twitter.com/n5QvrBSFWY— FearBuck (@FearedBuck) August 14, 2025
ఈ వీడియో చూసిన అభిమానులు పెద్ద ఎత్తున నటిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఇలా ఈమెకు పెళ్లి జరిగినప్పటికీ డైరెక్టర్ కట్ చెప్పిన ముద్దులు పెడుతున్న నేపథ్యంలో ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ పలువురు కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పెళ్లి జరిగిన ఇలాంటి సన్నివేశాలలో నటించడం ఏంటి ? ఇదేం పాడు బుద్ధి అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. మరి కొంతమంది సినిమా అన్న తర్వాత ఇలాంటివి సర్వసాధారణమే అంటూ కూడా మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. బహుశా రాచెల్ తన భర్త నుంచి విడిపోయారు కాబోలు అంటూ ఈ వీడియో పై విమర్శలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమా జులై 11, 2025వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకుంది.
Also Read: Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!