Balakrishna: సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna)ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నారు. బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. ఇప్పటివరకు మూడుసార్లు ఈయన హిందూపురం ఎమ్మెల్యేగా పోటీ చేయడమే కాకుండా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇలా నటుడిగా ఎమ్మెల్యేగా బాలకృష్ణ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు . ఇక నేడు స్వాతంత్ర దినోత్సవం(Independence Day) కావడంతో ఈయన తన సొంత నియోజకవర్గంలో జండా ఆవిష్కరణ చేశారు.
బస్సు డ్రైవర్ గా మారిన బాలయ్య..
ఇక ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా నేడు సూపర్ సిక్స్ హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని అమలులోకి తీసుకోవచ్చారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఆర్టీసీ బస్సు డ్రైవర్(Bus Driver) గా మారిపోయారు. హిందూపురం బస్టాండ్ నుంచి పార్టీ ఆఫీస్ వరకు స్వయంగా బస్సు నడిపారు. స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలందరిని బస్సులో కూర్చోబెట్టుకొని బాలకృష్ణ సుమారు రెండు కిలోమీటర్ల మేర డ్రైవింగ్ చేస్తూ కనిపించారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా రాజకీయ కార్యకలాపాలలో భాగంగా నిత్యం తన నియోజకవర్గంలో పర్యటిస్తూ బాలయ్య ప్రజా సమస్యలను నెరవేర్చడంతోనే మూడుసార్లు భారీ విజయం అందుకున్నారు.
విడుదలకు సిద్ధమైన అఖండ 2…
ఇలా ఒకవైపు రాజకీయ కార్యకలాపాలలో పాల్గొంటూనే మరోవైపు సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇటీవల కాలంలో బాలకృష్ణ తన వయసుకు తగ్గ కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇక బాలయ్య నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా సక్సెస్ అందుకోవడమే కాకుండా ప్రతి ఒక్క సినిమా కూడా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టటం విశేషం. ఇలా వరుస సినిమాల ద్వారా బాలయ్య యువ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పాలి. ఇటీవల డాకు మహారాజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలకృష్ణ త్వరలోనే అఖండ 2 (Akhanda 2)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఆర్టీసీ బస్సు నడిపిన బాలయ్య
హిందూపురంలో ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి చౌడేశ్వరి కాలనీ వరకు బస్సును నడిపిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ#NandamuriBalakrishna #AndhraPradesh pic.twitter.com/Cygq0Kv74r
— BIG TV Breaking News (@bigtvtelugu) August 15, 2025
సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. ఇదివరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులను కూడా బాలయ్య పూర్తి చేశారు. ఇప్పటివరకు సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీ విడుదల చేయాలని భావించారు. అదే రోజు పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో బాలయ్య డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం గురించి మేకర్స్ ఎక్కడ కూడా స్పందించలేదు.
Also Read: Mass Jathara: ఆగస్టు నుంచి తప్పుకున్న మాస్ జాతర… విడుదల అప్పుడేనా?