OTT Movie : థియేటర్లలో విడుదలైన ఒక హాలీవుడ్ హారర్ సినిమా ఓటీటీలోకి ఆలస్యంగా వస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. ఈ సినిమా అక్టోబర్ 31 నుంచి హారర్ ఫ్యాన్స్ ని భయపెట్టడానికి ఎదురు చూస్తోంది. ఇది యూదు జానపద కథ ఆధారంగా రూపొందింది. అబిజౌ అనే ఆడ రాక్షసి గురించి రక రకాల కథలు ఉన్నాయి. ఇది గర్భంలోనే పిల్లలను చంపుతుందని ఆ కథల్లో చెప్పబడింది. గుండె గట్టిగా ఉన్న వాళ్ళు ఈ సినిమాని చూడటానికి సిద్ధంగా ఉండండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘ది ఆఫరింగ్’ (The Offering) అనే సినిమా ఒక అమెరికన్ హారర్ థ్రిల్లర్. దీనికి ఓలివర్ పార్క్ దర్శకత్వం వహించారు. లీడ్ రోల్స్‌లో నిక్ బ్లడ్ (ఆర్ట్), ఎమిలీ విసెమాన్ (క్లెయిర్), అలాన్ కార్డునర్ (సాల్), పాల్ కే (టాడ్) నటించారు. 2022 లో USలో విడుదలైన ఈ హారర్ సినిమా నిడివి, 1 గంట 30 నిమిషాలు ఉంటుంది. ఈ హారర్ థ్రిల్లర్ 2025 అక్టోబర్ 31 నుంచి లయన్స్‌గేట్ ప్లే లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
ఆర్థర్ అనే అబ్బాయి, తన తల్లి చనిపోయాక, తండ్రి సాల్‌తో గొడవ పడి ఇంగ్లాండ్ వెళ్లిపోతాడు. సాల్ ఒక జ్యుడియో ఫ్యూనరల్ హోమ్ నడుపుతుంటాడు. అంటే చనిపోయిన వాళ్ల శవాలకు అంత్యక్రియలు చేస్తుంటాడు. చాలా రోజుల తరువాత ఆర్థర్ తన గర్భిణీ భార్య క్లెయిర్‌తో తిరిగి ఇంటికి వస్తాడు. తండ్రితో రాజీ పాడాలని అనుకుంటాడు. అదే ఇంట్లో బేస్ మెంట్ లో శవాల గది ఉంటుంది. ఒక రోజు సాల్‌కు ఒక పాత మనిషి శవం వస్తుంది. ఆ శవంలో అబిజౌ అనే భయంకర డెమన్ ఉంటుంది. పురాణాల ప్రకారం అబిజౌ గర్భిణీ పిల్లలను తింటుంది. ఇప్పుడు క్లెయిర్ ప్రెగ్నెంట్ గా ఉండటంతో డేంజర్‌లో పడుతుంది.
ఆ ఇంట్లో లైట్స్ ఆఫ్ అవుతూ, విచిత్ర సౌండ్స్ వస్తాయి. క్లెయిర్‌కు రాత్రి భయంకర డ్రీమ్స్ వస్తాయి. డెమన్ ఆమెను అదోలా పిలుస్తుంది. ఆమె పొట్టలో బేబీ బాగా కదులుతుంది. ఇది ఒక పురాతన డెమన్ అని సాల్ గ్రహిస్తాడు. అది శవంలో ఉంది, కానీ బయటకు రావాలని చూస్తుంది. సాల్, ఆర్థర్ కలిసి ప్రార్థనలు చేస్తారు. ఒక పూజారి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. కానీ డెమన్ క్లెయిర్ ని ఆవహిస్తుంది. ఆమె కళ్లు మారతాయి, వాయిస్ మారుతుంది, భయంకరంగా మాట్లాడుతుంది. ఆమె ఆర్థర్, సాల్‌ను దాడి చేస్తుంది.
Read Also : పిల్లల పెళ్ళిళ్ళను చెడగొట్టే దిక్కుమాలిన ఆచారం… కడుపుబ్బా నవ్వించే మలయాళం కామెడీ థ్రిల్లర్
సెల్లార్ లో శవాలు కూడా కదులుతాయి. పరిస్థితి భయంకరంగా మారుతుంది. చివరగా ఆర్థర్ తన భార్యను బతికించాలని తీవ్రంగా ప్రయత్నిస్తాడు. వీళ్ళు ఒక పెద్ద ప్రార్థనా రిచ్యువల్ చేస్తారు. డెమన్‌ను శవంలోకి తిరిగి పంపడానికి ట్రై చేస్తాడు. క్లైమాక్స్ లో ఒళ్ళు జలదరించే సీన్స్ ఉంటాయి. ఆర్థర్ తన భార్యను బ్రతికించుకుంటాడా ? ఆ డెమన్ ని వీళ్ళు కంట్రోల్ చేస్తారా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాని చూసి తెలుసుకోండి.