Cyclone Montha: మొంథా తుఫాన్ ఏపీ రాష్ట్రాన్ని భయపెట్టిస్తోంది. ఈ రాత్రికి తుఫాన్ ఉగ్రరూపం దాల్చనుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మొంథా తుఫాన్ తన దిశను మార్చుకుంది. యానాం వైపు వెళ్లకుండా కొనసీమ వైపు తుఫాను మళ్లిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే.. కాకినాడ – మచిలీపట్నం మధ్య తీరాన్ని తుఫాన్ తాకినట్టు అధికారులు తెలిపారు. పూర్తిగా తీరం దాటడానికి మూడు నుంచి నాలుగు గంటలు పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల దూరంలో.. కాకినాడకు 100 కిలోమీటర్ల దూరంలో.. విశాఖకు 200 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కొనసాగుతోంది. మరో మూడున్నర గంటల్లో కాకినాడ ప్రాంతంలో సైక్లోన్ తీరం దాటనుంది. రాత్రి 11 గంటల 30 నిమిషాలను నుండి అర్ధరాత్రి 12 గంటల లోపు పూర్తిగా తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మచిలీపట్నం నుండి కాకినాడ తీరం వరకు ఉన్న సముద్ర తీర ప్రాంత రేడియస్ లో మొంథా తుఫాన్ తీరాన్ని తాకిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
యానాం- అంతర్వేది పాలెం దగ్గర తీవ్రమైన సైక్లోన్ గా తీరాన్ని దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ ఇంకా పూర్తిగా తీరం దాటడానికి సమయం రాత్రి 11 అవ్వొచ్చని పేర్కొన్నారు. తీర ప్రాంత జిల్లాల్లో గంటకు 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం, వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాబోయే పది గంటల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు.. బీభత్సమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గంటకు వంద నుంచి 110 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. భారీ వర్షాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ALSO READ: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా.. ఈ ఏడు జిల్లాల్లో తుఫాన్ ఉగ్రరూపం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు