Mass Jathara: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందులో భాగంగానే భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ధమాకా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజం చెప్పాలంటే శ్రీలీలకు ధమాకా తరువాత అలాంటి హిట్ ఇంకొకటి వచ్చింది లేదు అంటే అతిశయోక్తి లేదు.
ఇక ప్రస్తుతం శ్రీలీల సైతం ఈ సినిమాపైనే ఎన్నో ఆశలను పెట్టుకుంది. మాస్ జాతర సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ ఏడాదిలో విజయాపజయాలను సరిసమనంగా చూస్తున్న ఏకైక నిర్మాత నాగవంశీ. కింగ్డమ్, వార్ 2 తో ఎంత నష్టాన్ని చవిచూశాడో.. కొత్త లోకతో కొంతవరకు సక్సెస్ ను అందుకున్నాడు. ఇకమధ్యలో మాస్ జాతరను దింపాలనుకున్నా సరైన టైమ్ దొరక్క అక్టోబర్ 31 కి వాయిదా వేశాడు.
అక్టోబర్ 31 న మాస్ జాతర గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ ఒకపక్క ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంకోపక్క సినిమాలోని లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేనా వివాదాలను కూడా తీసుకొచ్చిపెట్టాయి.
ఇక తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. హుడియో హుడియో అంటూ సాగే సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రవితేజ, శ్రీలీల మధ్య ప్రేమ పుట్టే సమయంలో ఈ సాంగ్ వస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీలీల వెంట రవితేజ పడుతూ.. ఆమెపై వచ్చే భావాలను పాడుతున్నట్లు తెలుస్తోంది.
భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సాంగ్ మొత్తంలో శ్రీలీల అందం హైలైట్ అని చెప్పొచ్చు నిండుగా లంగావోణి వేసుకొని.. కళ్ళనిండా కాటుక పెట్టుకొని ఎంతో అందంగా కనిపించింది. ఇక పూర్తి సాంగ్ ను అక్టోబర్ 8 న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ సాంగ్ కూడా చార్ట్ బస్టర్ గా మారుతుందేమో చూడాలి.