Bandla Ganesh: నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే నిర్మాతగా మారి .. వరుస సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తరువాత నిర్మాతగా కొనసాగుతాడు అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్ళాడు. అక్కడ స్థిరంగా లేకుండా లేనిపోని డాబులకు పోయి.. కొన్ని మాటలు వదిలేశాడు. ఇక ఆ తరువాత అన్న మాటలకు పశ్చాత్తాపపడి రాజకీయాలను వదిలేసి.. ఇటు సినిమాలను వదిలేసి ఎంచక్కా బిజినెస్ చేసుకుంటూ బిజీగా మారాడు.
ఇక సినిమాలు మానేసినా.. రాజకీయాలు వదిలేసినా తన మనసులోని మాటలను అభిమానులతో పంచుకోవడం మాత్రం మానలేదు. సోషల్ మీడియాలో నిత్యం తనకు మంచి అనిపించింది మంచిగా.. చెడు అనిపిస్తే ఎవరికీ భయపడకుండా నిర్మొహమాటంగా చెప్పేయడం బండ్లన్నకు అలవాటు. మొన్నటికి మొన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ వేదికపై ఇండస్ట్రీ మాఫియా గురించి పచ్చి నిజాలు మాట్లాడి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు.
బండ్ల గణేష్ ఒకరిని అభిమానించడం మొదలుపెట్టాడు అంటే అది ఆయన చచ్చేవరకు అలాగే ఉంటుంది. ఈ విషయాన్నీ ఆయన ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. బండ్ల గణేష్ అభిమానించే కాదు కాదు ఆరాధించే వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ మొదటి వరుసలో ఉంటాడు. పవన్ కు భక్తుడు బండ్ల అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాంటి భక్తుడు.. దేవుడు పవన్ కళ్యాణ్ కు దూరమయ్యాడు. అందుకు కారణం త్రివిక్రమ్. ఆయన మాటలు విని పవన్.. బండ్లన్న ను దూరం పెట్టారని టాక్. అందులో నిజమెంత అనేది తెలియదు. కానీ, బండ్లన్న పవన్ కు దూరం అయినా కూడా ఆయనే దేవుడు అని చెప్పిన రోజులు ఉన్నాయి.
అయితే ఈ మధ్యకాలంలో బండ్లన్న మాటలు చాలా వింతగా ఉంటున్నాయి. ఎవరిని అంటున్నాడో కూడా తెలియకుండా మారింది. ఒకసారి కృతజ్ఞత లేని వ్యక్తి అంటాడు. ఇంకోసారి అధికారంలో నేరాన్ని దాచగలవు, కానీ జీవితం ముందు దాచలేవు. నిజం ఎప్పటికైనా వెలుగులోకే వస్తుంది అని అంటాడు. బండ్లన్న ఎవరిని ఇలా అంటున్నాడు అంటే కచ్చితంగా పవన్ కళ్యాణ్ నే అని అందరూ అనుకుంటూ వస్తున్నారు. తాజాగా నా దేవుడు పవనే అని చెప్పి మళ్లీ మాట మార్చేశాడు.
తాజాగా బండ్ల.. నా పేరు బండ్ల గణేష్. నా దేవుడు – నాకంటే మీకే బాగా తెలుసు. ఒకటే మాట… ఒకటే జీవితం అంటూ రాసుకొచ్చాడు. దేవుడు అంటే పవన్ కళ్యాణ్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మొన్నటివరకు అది ఇది అని ఇప్పుడు మళ్లీ దేవుడు అని మాట మార్చేసావ్. నీ మాటలు ఇక నమ్మవు అంటూ కొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి బండ్ల ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టులు చేస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది.