Pakistan Players: భారత్ అలాగే పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. కాశ్మీర్ ప్రాంతం వివాదంగా మారడంతో రెండు దేశాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా జరిగిన సంగతి తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో ఇండియా అంటే అస్సలు పడని పాకిస్తాన్ ప్లేయర్లు, బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ తమన్నా భాటియా ( Tamannaah Bhatia ) నటించిన ఆజ్ కి రాత్ ( Aaj Ki Raat ) పాటకు పాకిస్తాన్ ప్లేయర్లు స్టెప్పులు వేసిన వీడియో బయటకు వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
హీరోయిన్ తమన్నా బాలీవుడ్ ఇండస్ట్రీలో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె చాలా ఐటెం సాంగ్స్ కూడా చేస్తోంది. ఇందులో భాగంగానే స్త్రీ 2 ( Stree 2 ) అనే బాలీవుడ్ చిత్రంలో ఆజ్ కి రాత్ అనే ప్రత్యేక పాటలు మెరిసింది. ఈ పాటలో హీరోయిన్ తమన్నా చాలా బోల్డ్ గా కనిపిస్తుంది. ఇప్పటికి కూడా ట్రెండింగ్ లోనే ఈ సాంగ్ ఉంది. అయితే ఈ పాట బాగా వైరల్ అయిన నేపథ్యంలో… పాకిస్తాన్ ప్లేయర్లు కూడా ఈ పాటకు ఫీదా అయిపోయారు. ఇందులో భాగంగానే తాజాగా తమన్నా పాటకు స్టెప్పులు వేశారు పాకిస్తాన్ ప్లేయర్లు. ఊర మాస్ స్టెప్పులతో రెచ్చిపోయారు.
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ సోదరుడి వివాహం తాజాగా జరిగింది. ఈ నేపథ్యంలోనే మహమ్మద్ రిజ్వాన్ సోదరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు బయటకు వస్తున్నాయి. ఇందులో భాగంగానే హీరోయిన్ తమన్నా పాటకు ఈ వివాహంలో పాకిస్తాన్ క్రికెటర్లు స్టెప్పులు వేశారు. మహమ్మద్ రిజ్వాన్ అలాగే జమాన్ ఇతర క్రికెటర్లు కూడా… ఈ పాటకు డాన్స్ వేసినట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది. ఈ వీడియోలో రిజ్వాన్ తో పాటు పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు కనిపించారు.
వాళ్ల బ్యాక్ గ్రౌండ్ లో తమన్నా ఆజాకి రాత్ సాంగ్ వస్తోంది. దీంతో తమన్నా పాటకే వాళ్ళు డాన్స్ చేసినట్లు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ వీడియోను చూసిన ఇండియన్ అభిమానులు అదిరిపోయే కామెంట్ చేస్తున్నారు. ఏ దేశానికి సంబంధించిన సాంగ్స్ ప్లే చేస్తున్నామో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ప్లేయర్లు ఉన్నారని ఎద్దేవా చేస్తున్నారు. పొద్దున లేస్తే ఇండియాను టార్గెట్ చేసే పాకిస్తాన్, ఇప్పుడు బాలీవుడ్ పాటలపై ఆధార పడాల్సి వచ్చిందని మరి కొంతమంది సెటైర్లు పేల్చుతున్నారు.
These Pakistani cricketers hate India
But then play Indian songs at their weddings.
At Mohammad Rizwan’s brother’s wedding, they were playing Aaj Ki Raat. pic.twitter.com/ZpUCnSK6Ku
— Yanika_Lit (@LogicLitLatte) October 5, 2025