Meena: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి (Savitri ) తర్వాత అంతటి పేరు సొంతం చేసుకున్న ఏకైక హీరోయిన్ సౌందర్య (Soundarya). అతి చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చిన నాలుగేళ్లలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ ని సొంతం చేసుకుని..అందరి మనసులలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అకాల మరణం పొంది, అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసిందే. అటు సౌందర్య లేని లోటును ఇప్పటికీ ఎవరు తీర్చలేకపోతున్నారు అనేది వాస్తవం. అంతలా ప్రజల హృదయాలలో నాటుకుపోయిన ఈ ముద్దుగుమ్మను గుర్తు చేసుకుంటూ ఎంతో మంది హీరోయిన్స్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆమని(Aamani ) అయితే సౌందర్య కంటే నన్ను తీసుకుపోయి ఉంటే బాగుండేది అని దేవుడిని కూడా ప్రార్థించింది. అంతలా ప్రజల మనసు దోచుకుంది సౌందర్య.
ఇదిలా ఉండగా సౌందర్య మరణం సమయంలో తాను కూడా ఉండాల్సింది అని.. సౌందర్యతో పాటే తాను కూడా అప్పుడే చనిపోవాల్సిందే అంటూ ఊహించని కామెంట్లు చేసింది సీనియర్ హీరోయిన్ మీనా(Meena ). తాజాగా జగపతిబాబు (Jagapathi Babu) హోస్ట్ గా వ్యవహరిస్తున్న సెలబ్రిటీ టాక్ షో ‘జయమ్ము నిశ్చయమ్ము రా’ కార్యక్రమానికి తోటి హీరోయిన్స్ సిమ్రాన్(Simran ), మహేశ్వరి (Maheswari) తో కలిసి హాజరయ్యారు మీనా. ఇందులో భాగంగానే ఎన్నో విషయాలు పంచుకున్న ఈమె . సౌందర్య మరణం నాటి విషయాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
ALSO READ:Bigg Boss 9 Promo: హౌస్ లో మరో స్టోరీ… ఇమ్మానుయేల్ నడుము గిల్లిన తనూజ!
సౌందర్య తో పాటు నేను కూడా చనిపోవాల్సింది…
మీనా మాట్లాడుతూ..” ఆరోజు హెలికాప్టర్లో సౌందర్యతో పాటు నేను కూడా ప్రయాణించాల్సి ఉంది. నన్ను కూడా అదే క్యాంపెయిన్ కి ఆహ్వానించారు. కానీ నేను ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల.. ఆ క్యాంపెయిన్ కి వెళ్లలేకపోయాను. షూటింగ్లో ఉన్న నేను సౌందర్య మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ అయ్యాను.. శరీరం మొత్తం చెమటలు పట్టేసాయి.. “అంటూ అసలు విషయాన్ని తెలిపింది మీనా.. మీనా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. “మీకు ఈ భూమి మీద నూకలు ఉన్నాయి. అందుకే తప్పించుకున్నారు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది “భగవంతుడి దయ మీ పైన ఉంది” అంటూ ఇంకొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికి తన స్నేహితురాలు సౌందర్య మరణాన్ని తట్టుకోలేకపోతూ ఎమోషనల్ అయిపోయింది మీనా.
సౌందర్య కెరియర్..
సౌందర్య విషయానికి వస్తే.. తన సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా వెంకటేష్, జగపతిబాబు వంటి హీరోలతో ఎక్కువగా సినిమాలు చేసి.. బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడిగా పేరు కూడా దక్కించుకుంది. కెరియర్ పీక్స్ లో ఉండగానే సినిమాలు నిర్మించి, ఆర్థికంగా కూడా నష్టపోయిన ఈమె.. అనూహ్యంగా రాజకీయ ప్రచారానికి వెళ్లి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది. మొత్తానికైతే సౌందర్య మన మధ్య లేకపోయినా అప్పుడప్పుడు సినిమాలలో ఆమె ఫోటోని ఉపయోగించుకుంటూ.. ఆమెను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉన్నారు సినీ సెలబ్రిటీలు.