Megastar Chiranjeevi : తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. తన సినిమా టైటిల్స్ లాగే చెప్పాలి అంటే స్వయంకృషితో ఎదిగి, అభిమానులకు అన్నయ్య అయ్యాడు. ఆపదొస్తే ఆపద్బాంధవుడు అయ్యాడు. తనకంటూ ఒక స్థాయిని సంపాదించుకొని అందరితో జై చిరంజీవ అనిపించుకున్నారు. ఇప్పటికీ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనే కలలకు అనే దర్శకులు చాలామంది ఉన్నారు.
అయితే కొందరి కలలు నిజమబోతున్నాయి అనుకునే తరుణంలో వాళ్లకు ఏవేవో జరుగుతుంటాయి. చేతుల వరకు వచ్చిన ప్రాజెక్టు పక్కకెళ్ళిపోతుంది. పూజలు కూడా జరిగి సినిమా లాగిపోతుంటాయి. షూటింగ్ కూడా జరిగి సినిమాలు క్యాన్సిల్ అవుతుంటాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఇలాంటివి చాలా ఉన్నాయి.
శివ సినిమాతో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా రామ్ గోపాల్ వర్మ
వర్మ ప్రస్తావన వస్తే ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. నాగార్జున వెంకటేష్ వంటి హీరోలతో అప్పట్లో రామ్ గోపాల్ వర్మ సినిమాలు చేసేవారు. రాము కెరియర్ పీక్ లో ఉన్న టైంలో చిరంజీవితో కూడా ప్రాజెక్టు సెట్ అయింది. అయితే ఆ సినిమా కొన్ని రోజులు షూటింగ్ జరిగి మధ్యలో ఆగిపోయింది.
పూరి జగన్నాథ్ మరియు చిరంజీవి మధ్య ప్రాజెక్టులు ఐదు ఆరుసార్లు మొదలై ఆగిపోయాయి. రెండు మూడుసార్లు పూజ కూడా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించాలి. ఆటో జానీ అనే టైటిల్ కూడా అప్పట్లో ఫిక్స్ చేశారు.
కానీ అప్పటికి చిరంజీవికి కొన్ని రాజకీయ పరిచయాలు ఉండటం వలన మీరు రీఎంట్రీ సినిమా చేస్తే సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి అని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దానివలన మెగాస్టార్ చిరంజీవి తమిళ్లో హిట్ అయిన కత్తి సినిమాను తెలుగులో ఖైదీ నెంబర్ 150 గా మార్చి తీశారు.
రచయితగా జై చిరంజీవ అనే సినిమాకి త్రివిక్రమ్ పనిచేశారు. కానీ దర్శకుడుగా త్రివిక్రమ్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు చిరంజీవి. వినయ విధేయ రామ సినిమా టైంలో చిరంజీవి మాట్లాడుతూ..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మాతగా నేను హీరోగా ఒక సినిమా చేస్తున్నాను అంటూ పబ్లిక్ లో అనౌన్స్ చేశారు. అది కూడా చిరు లీక్స్ లో ఒక భాగమే. అయితే ఆ సినిమా కోసం ఇప్పటికీ త్రివిక్రమ్ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. త్రివిక్రమ్ అభిమానులు ఎందుకు ఎదురు చూస్తున్నారంటే, చిరంజీవికి త్రివిక్రమ్ ఇచ్చే ఎలివేషన్ ఒక లెవెల్. ఇటువంటిది చిరంజీవితో కంప్లీట్ మూవీ అంటే ఎలా ఉంటుంది.
ఇలా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేస్తున్నట్టు మాటలు చెప్పారు. ఆ ప్రాజెక్టులు మాత్రం అలానే పక్కకు వెళ్లిపోయాయి. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కూడా సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి కొత్తగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు.
Also Read: Sithara Naga Vamsi : ఎమోషన్స్‌తో ఆడుకోవడం అలవాటైపోయింది.. అసలు టైం సెన్స్ లేదు