CM Revanth: ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, వెల్పేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమెర్జెన్సీ ఫండ్ ను విడుదల చేశారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.10 కోట్లు చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను వినియోగించే అధికారులను సొసైటీ సెక్రటరీలకు కల్పించారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు పరిష్కారం చూపనుంది.
ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్, హెల్త్ చింగ్ సమస్యల పరిష్కారం కోసం.. ప్రభుత్వం నిధుల వైపు చూడకుండా చర్యలు తీసుకుంటుంది. వెల్ఫేర్ సొసైటీలకు రూ. 60కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేశారు. ప్రభుత్వ హోటల్ లో సమస్యల సత్వర పరిష్కారం కోసం.. తొలిసారిగా ప్రత్యేక ఫండ్ ఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. తరచూ గురుకులాల్లో, హాస్టల్స్ లో సమస్యలు బయటపడుతుండటంతో సీఎం వినూత్న ఆలోచన చేపట్టారు.
గతంలో రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో.. చిన్నపాటి సమస్యలు కూడా పెద్దవిగా మారి.. విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపాయి. ఈ అనుభవాలే సీఎం రేవంత్‌ని ఈ కొత్త విధానం ఆవిష్కరించేలా చేశాయని చెప్పవచ్చు. విద్యార్థులు సురక్షితంగా ఉండటం, వారి విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా.. వాటిపై ప్రభావితం కాకుండా చూడటం లక్ష్యమని ఆయన తెలిపారు.
Also Read: శంషాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం
ఇప్పటి వరకు సమస్యలు వచ్చినప్పుడు.. దానికి పరిష్కారం రావడానికి కొన్ని నెలల టైమ్ పట్టేది. ఇకపై సొసైటీ స్థాయిలోనే ఫండ్ అందుబాటులో ఉండడం వల్ల వెంటనే స్పందించవచ్చు.