BigTV English

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Rohit Sharma Tesla Car:  టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల టెస్లా కారులో మెరిసిన సంగతి తెలిసిందే. టెస్లా వై మోడల్ కారు ( Tesla Model Y RWD) కొనుగోలు చేసిన రోహిత్ శర్మ ముంబైలో జరిగిన ఈవెంట్ కు వచ్చారు. రెండు రోజుల కిందట ముంబైలో సియట్ క్రికెట్ అవార్డుల పండుగ జరిగింది. ఈ ఈవెంట్ కు రోహిత్ శర్మ అలాగే ఆయన భార్య రితికా కూడా హాజరయ్యారు. వీళ్ళిద్దరూ టెస్లా కారులో దిగడం హాట్ టాపిక్ అయింది. అయితే దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ( Elon Musk ) స్పందించారు. స్వయం రోహిత్ శర్మనే టెస్లా కారు డ్రైవ్ చేస్తున్నాడు. అత‌నే డ్రైవ్ చేశాడంటే, టెస్లాకు ప్ర‌చారమే అవ‌స‌రం లేదంటూ రీ-పోస్ట్ చేశారు మస్క్‌.


Also Read: IND-W vs SA-W: కొంప‌ముంచిన‌ హర్మన్.. ద‌క్షిణాఫ్రికా విక్ట‌రీ..పాయింట్ల ప‌ట్టిక‌లో టీమిండియా సేఫ్‌

రోహిత్ శర్మ టెస్లా కారుపై ఎలాన్ మస్క్ ( Elon Musk ) పోస్ట్

టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ముంబైలో టెస్లా కారులో మెరవడంపై ఎలాంటి మస్క్ స్పందించారు. మొదట రోహిత్ శర్మ ఫోటోను ట్యాగ్ చేస్తూ టెస్లాకనామిక్స్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టింది. అయితే దాన్ని రీ-పోస్ట్ చేశారు ఎలాన్ మస్క్. టీమిండియాను ఏలిన కెప్టెన్ రోహిత్ శర్మనే టెస్లా కారును వాడుతున్నాడు. అతడే స్వయంగా కారణం డ్రైవ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దాదాపు 45 మిలియన్ల ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ కలిగి ఉన్న వ్యక్తి రోహిత్ శర్మ. అతనే టెస్లా కారును డ్రైవ్ చేశాడు. అలాంటి రోహిత్ శర్మ టెస్లాను నడపడమే పెద్ద ప్రచారం.. ఇక ఈ కారుకు ఎలాంటి ప్రచారమే అవసరం లేదు అంటూ ఎలా అని ఎలాన్ మస్క్ పోస్టు పెట్టారు.


రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

టీమిండియా మాజీ వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల కొనుగోలు చేసిన‌ టెస్లా కారు నెంబ‌ర్ వెనుక ర‌హ‌స్యం ఉంది. ఈ కారు నెంబ‌ర్ 3015. రోహిత్ శ‌ర్మ‌- రితికా ఇద్ద‌రు పిల్ల‌ల పుట్టిన రోజు తేదీలే ఈ కారు నంబ‌ర్‌. రోహిత్ శ‌ర్మ కూతురు స‌మైరా డిసెంబ‌ర్ 30వ తేదీన జ‌న్మించారు. రోహిత్ శ‌ర్మ కుమారుడు అహాన్ నంబ‌ర్ 15వ తేదీ. వీళ్ల ఇద్ద‌రి పుట్టిన రోజు తేదీల‌నే టెస్లా కారు నంబ‌ర్ గా పెట్టుకున్నారు రోహిత్‌. దీని కోసం ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు పెట్టార‌ట‌. ఇది ఇలా ఉండగా రోహిత్ శర్మ కొనుగోలు చేసిన తెలుసా మోడల్ వై కారు ధర 59.89 లక్షలు గా ఉంటుంది. ఇది బేస్ మోడల్ మాత్రమే. ఇందులో టాప్ ఎండ్ కారు ధర 73.89 లక్షలు గా ఉంటుంది. రోహిత్ శర్మ టాప్ ఎండ్ మోడల్ కొనుగోలు చేశాడని తెలుస్తోంది.

Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్‌….రూ.325 కోట్లతో భారీ స్కెచ్‌, కాళ్లు మొక్కిన కుర్రాడు

 

 

 

Related News

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Ritika Sajdeh: గంభీర్‌… నీకు కండ్లు దొబ్బాయా..నా మొగుడు ఎలా ఆడుతున్నాడో చూడు

Hardik Pandya GirlFriend: మ‌రో కొత్త పిల్ల‌ను ప‌డేసిన హార్దిక్ పాండ్యా..ఆ ఇద్ద‌రిని వ‌దిలేసి మ‌రీ !

IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలానికి ముహుర్తం ఫిక్స్‌.. స‌గం ప్లేయ‌ర్ల‌ను వ‌దిలేస్తున్న CSK

Yashasvi Jaiswal Century: యశస్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ..స‌చిన్ రికార్డు బ‌ద్ద‌లు,భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా

Thaman: 40 బంతుల్లో 108 ప‌రుగులు..త‌మ‌న్ విధ్వంసం.. ఉప్ప‌ల్ లో కొడితే, తుప్ప‌ల్లో ప‌డింది

IND-W vs SA-W: రీల్స్ పైన ఉన్న ఫోకస్, బ్యాటింగ్ పైన లేదు…లేడీ కోహ్లీ అనుకుంటే, నట్టేట ముంచింది!

Big Stories

×