Kantara Chapter1 collections : సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే విషయం ఎంత నిజమో, తెలుగు ప్రేక్షకులు గొప్ప సినిమాలను ఆదరిస్తారు అనేది కూడా అంతే నిజం. భాషతో సంబంధం లేకుండా సినిమాను ప్రేమించడం తెలుగు ప్రేక్షకులు అలవాటు చేసుకున్నారు. వాస్తవానికి సినిమా అంటే ఒక వ్యసనం అన్న కూడా తప్పులేదు. ఎన్నో డబ్బింగ్ సినిమాలు తెలుగులో మంచి సక్సెస్ సాధించాయి. అందులో కాంతారా సినిమా ఒకటి.
కాంతారా సినిమా కేవలం మౌత్ టాకుతో అప్పట్లో దాదాపు 50 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది. బన్నీ వాస్ ఈ సినిమా చూసి అల్లు అరవింద్ తో చెప్పడంతో వెంటనే గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసింది. ఆ సినిమా అప్పట్లో మంచి లాభాలు వాళ్లకు తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ మీద కూడా ఉండటంతో సినిమాకు మంచి ఆదరణ లభించింది.
రీసెంట్ టైమ్స్ లో సినిమా సక్సెస్ కలెక్షన్లతో కొలవడం అలవాటు చేసుకున్నారు. ఒకప్పుడు ఎన్ని రోజులు ఎన్ని సెంటర్స్ లో ఆడింది అనేది టాపిక్ లా ఉండేది. ఇప్పుడు ఎన్ని రోజులు ఆడింది అనేది లెక్క కాదు, ఎంత కలెక్ట్ చేసింది అదే మేటర్.
దీనిని పట్టుకొని చాలామంది నిర్మాతలు చనువు తీసుకోవడం మొదలుపెట్టారు. సినిమా హిట్ ప్లాపు అనే టాకుతో సంబంధం లేకుండా పోస్టర్ మీద కలెక్షన్స్ విపరీతంగా వేయడం మొదలుపెట్టారు. అయితే ఇదే విషయాన్ని ఫ్యాన్స్ హ్యాపీనెస్ కోసం పోస్టర్ మీద నెంబర్లు వేస్తాం అని నిర్మాత నాగవంశీ కూడా ఒక సందర్భంలో చెప్పాడు.
అది అప్పటికే చాలామందికి తెలుసు, కానీ నాగ వంశీ చెప్పేసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేసింది. హిట్ కానీ సినిమాకు కలెక్షన్ వేసినా పరవాలేదు. హిట్ అయిని మంచి టాక్ వచ్చిన తర్వాత కూడా పోస్టర్స్ పై కలెక్షన్స్ విపరీతంగా వేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కాంతారా చాప్టర్ వన్.
కాంతారా చాప్టర్ 1 సినిమా చూసి చాలామంది సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. అద్భుతమైన కలెక్షన్స్ కూడా ఈ సినిమాకు వస్తున్నాయి. ఇక్కడ అసలైన చిక్కు ఏంటంటే. ఈ సినిమాకు 6వ రోజు కలెక్షన్లు 427 కోట్లు. 7వ రోజు కలెక్షన్లు ఏకంగా 509 కోట్లు. అంటే ఒక్కరోజులో 87 కోట్లు ఈ సినిమాకు వచ్చినట్లు పోస్టర్ పై వేశారు.
సినిమా హిట్ అయింది మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అంతవరకు వాస్తవమే. కానీ ఒక్కరోజులో 87 కోట్లు వచ్చాయి అంటే అది నమ్మశక్యం కాని పని. మరోవైపు హైదరాబాదులో చాలాచోట్ల బుక్ మై షో యాప్ లో సినిమాకి గ్రీన్ బాక్సెస్ కనిపిస్తున్నాయి. ఒక్కరోజులో అంత వచ్చాయి అనుకోవడానికి 7వ రోజు హాలిడే కూడా లేదు.
అంటే ఒక్కసారిగా ఇటువంటి నెంబర్స్ వేసి ఆడియన్స్ ఏం చెప్పాలి అని రుద్దుతున్నారు అనేది అర్థం కాని విషయం. ప్రతి సినిమాని ఆదరిస్తున్నది ప్రేక్షకుడు, ప్రేక్షకుడిని గ్రాంటెడ్ గా తీసుకొని మభ్య పెట్టే ప్రయత్నాలు చేయకూడదు. కనీసం రేపటి కలెక్షన్స్ లో అయినా నిజాయితీగా వ్యవహరిస్తారో లేకుంటే నచ్చినట్లు నెంబర్స్ వేసుకుంటూ వెళ్లిపోతారో చూడాలి.
Also Read: Megastar Chiranjeevi : మాటలు మాత్రమే చెప్పారు, ప్రాజెక్టులు పక్కన పడేసారు