Kiran Abbavaram : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోస్ లో కిరణ్ అబ్బవరం ఒకడు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసి తనకంటూ ఒక గుర్తింపు సాధించుకొని రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా డీసెంట్ సక్సెస్ సాధించింది. తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో తనలో ఉన్న రైటర్ ని కూడా బయటకు తీశాడు. ఆ సినిమా హిట్ అవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.
కిరణ్ కు వరుస అవకాశాలు వచ్చిన తరుణంలో ప్రతి సినిమా చేసుకుంటూ వెళ్ళాడు. అయితే అదే సందర్భంలో వరుస ఫెయిల్యూర్స్ కూడా వచ్చాయి. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని క అనే సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. అయితే కిరణ్ సింపతి కార్డు ప్లే చేస్తున్నాడు అని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు. దానిపై చాలా ఘాటుగా రెస్పాండ్ అయ్యాడు.
నేను సింపతి అనే అంశం మీద మాట్లాడకూడదు అనుకున్నాను ఇప్పుడు మాట్లాడుతున్నాను. మా అమ్మ గురించి నేను మాట్లాడటం సింపతినా? అది కూడా సింపతిగా తీసుకుంటే ఇంక నేనేం మాట్లాడాలి.? ఇన్ని రోజులు స్టేజ్ మీద మాట్లాడాను ఫస్ట్ సినిమా నుంచి, ఇన్ని స్టేజిల మీద మాట్లాడిన కిరణ్ అబ్బవరం. ఫెయిల్యూర్ అయిన సినిమా గురించి కూడా మాట్లాడాను. ఇది ఎవరికీ కనిపించదు. క అనే సినిమా ఒక అమ్మ కడుపులో జరిగే ఒక కథ.
నేను మా అమ్మతో పక్కన కూర్చుని కూడా సరిగ్గా మాట్లాడను. మా అమ్మ గురించి చెప్పే సందర్భం ఇది అని చెప్పి నేను మాట్లాడితే. అది సింపతి అని అంటే వాళ్లను నేను ఏమనాలి.? ఒకటి క్లారిటీగా చెప్తున్నాను. నన్ను ఏదైనా వాడండి పర్వాలేదు. సినిమా బాలేదు అంటే నేను ఒప్పుకుంటా, సింపతి అంటే మాత్రం నాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక్కడినే వచ్చా. 70 వేలకు ఉద్యోగం చేసుకున్న కూడా నేను బ్రతకగలను.
భయపడకుండా లైఫ్ రిస్క్ చేసి ఇక్కడ వరకు వచ్చా, సినిమాలు చేసుకుంటున్నాను. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను. కష్టమో నష్టమో పరిగెడుతూనే ఉన్నాను. నేను రేపు ఎంత దూరం వెళ్ళినా, ఎంత సక్సెస్ సాధించినా, ఎంత పెద్ద స్థాయికి వెళ్లిన తిరిగి చూసుకుంటే కిరణ్ అబ్బవరం. అరే ఇది మొత్తం నీ సొంత కష్టం ఇది నువ్వు రా అని ఉండటానికి కష్టపడుతున్నాను. అంత స్ట్రాంగ్ పర్సన్ నేను. నా దగ్గర సింపతి అనే పదం వాడితే అసలు నేను ఒప్పుకోను. అని కిరణ్ సమాధానం చెప్పాడు.
ఇకపోతే కిరణ్ నటిస్తున్న K-Ramp సినిమా అక్టోబర్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఉండబోతుంది అని కూడా చిత్ర యూనిట్ అంతా చెబుతున్నారు.
Also Read: Kantara Chapter1 collections : మరి హీనంగా.. హిట్ అయిన సినిమాకి కూడానా? ప్రేక్షకులు పిచ్చోళ్ళా?