OTT Movie : ఒక అద్భుతమైన మలయాళం సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా ఒంటరి జీవితం ఏం కోరుకుంటుందనే విషయాన్ని, దర్శకడు చూడ చక్కగా తెరకెక్కించాడు. ఈ కథ ఒంటరిగా ఉండే ఒక వృద్ధుడి ఇంట్లోకి, ఒక దొంగ ఎంట్రీ ఇవ్వడంతో మొదలవుతుంది. ఈ అందమైన కథను ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలసి చూసి ఆనందించండి. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Once Upon a Time There Was a Kallan’ మలయాళం కామెడీ సినిమా. ఫాజిల్ మహమ్మద్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో శ్రీనాథ్ భాసి, ప్రతాప్ పోతన్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 మే 30న థియేటర్లలో రిలీజ్ అయింది. IMDbలో 5.8/10 రేటింగ్ తో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
వయసు మళ్ళిన ఒక పెద్దాయన, లంకంత కొంపలో ఒంటరిగా జీవిస్తుంటాడు. కానీ ఎప్పుడూ ఎదో పోగొట్టుకున్నట్లు జీవితం గడుపుతుంటాడు. అతని జీవితం ఇలా నడుస్తున్నప్పుడు, ఒక రోజు రాత్రి ఆ ఇంట్లోకి కళ్లన్ అనే దొంగ వస్తాడు. అక్కడ విలువైన వస్తువులు, డబ్బు దోచుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అక్కడ దొంగకి ఊహించని పరిణామం ఎదురవుతుంది. అక్కడ డోర్ లాక్ అవుతుంది. ఆఇంట్లో ఉండే పెద్దాయన అతనికి ఎదురుపడతాడు. ఇక్కడినుంచి స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. కళ్లన్ ఆ పెద్దాయనను చూసి భయపడతాడు. ఇక పోలీసులకు దొరికిపోతానని కంగారుపడతాడు. కానీ అక్కడ పరిస్థితి వేరేలా మారుతుంది.
Read Also : సైకో పిల్లతో చావు దెబ్బలు తినే జీనీ… కడుపుబ్బా నవ్వించే కొరియన్ కామెడీ… ఈ వీకెండ్ కు సిరీస్ సెట్టు
ఆ పెద్దాయన అతనికి ఫుడ్ పెట్టి ఆప్యాయంగా చూస్తాడు. అతను ఎందుకు ఆ ఇంట్లో ఒంటరిగా ఉండాల్సి వచ్చిందో చెప్తాడు. దొంగ మొదట్లో భయపడ్డా, తరువాత తేరుకుని అతనితో మనసు విప్పి మాట్లాడటం మొదలుపెడతాడు. తానూ ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో ఒక్కో సీన్ ఫ్లాష్ బ్యాక్ లో వివరిస్తాడు. దీంతో వీళ్లిద్దరి మధ్య ఒక రకమైన అనుబంధం ఏర్పడుతుంది. చివరికి దొంగని, ఆ పెద్దయన తనతోనే ఉండాలని అడుగుతాడు. నాకు దొరికిన ఏకైక స్నేహితుడు నువ్వేనని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ సినిమా ఆడియన్స్ కి హార్ట్ టచ్ ఎమోషన్స్ ఇస్తుంది. ఆ దొంగ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? పెద్దాయన ఒంటరిగా ఎందుకు జీవిస్తుంటాడు ? ఈ కథ ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలని అనుకుంటే, ఈ మలయాళం ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ సినిమాని మిస్ కాకుండా చూడండి.