Sithara Naga Vamsi : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ ప్రొడక్షన్ హౌస్ లో హారిక హాసిని క్రియేషన్స్ ఒకటి. ఈ బ్యానర్ లో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ మాత్రమే సినిమాలు చేస్తారు. జులాయి సినిమాతో మొదలైన ఈ బ్యానర్ దిగ్విజయంగా అనేక సినిమాలను నిర్మించింది. ఈ బ్యానర్ లో వచ్చిన సినిమాలలో కేవలం అజ్ఞాతవాసి మినహాయిస్తే అన్ని సినిమాల్లో కూడా అద్భుతమైన హిట్ అయ్యాయి.
అజ్ఞాతవాసి సినిమా డిజాస్టర్ తర్వాత అరవింద సమేత వీర రాఘవ సినిమా అద్భుతమైన ఘన విజయం సాధించింది. ఈ సినిమా దాదాపు 200 కోట్లు వరకు వసూలు చేసింది. ఈ బ్యానర్ కి అనుసంధానంగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించారు. ఈ బ్యానర్లో నిర్మాతల నాగ వంశీ సినిమాలు నిర్మిస్తూ ఉంటారు. ఈ బ్యానర్ లో కూడా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి.
ఈ బ్యానర్ కి మంచి పేరు ఉంది. అలానే జెర్సీ లాంటి నేషనల్ అవార్డ్స్ కూడా ఈ బ్యానర్ లో నిర్మితమయ్యాయి. కానీ ఈ బ్యానర్ గురించి ఒక కంప్లైంట్ ఉంది. ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవడం ఈ బ్యానర్ కు అలవాటైపోయింది. మంచి కాంబినేషన్ సెట్ చేస్తారు. కానీ సరైన అప్డేట్స్ ఎవరు. ఒకవేళ అప్డేట్ ఇచ్చినా కూడా చెప్పిన టైంకి అసలు నిలబడరు.
ఉదాహరణకు ఒక టీజర్ ఈ టైంకి రిలీజ్ చేస్తాము అని చెబితే ఆ టైంకి ఆ టీజర్ రాదు. ఇలా ఎన్నోసార్లు జరిగింది. ఇంక ఈరోజు కూడా అనుదీప్ కేవీ దర్శకత్వంలో విశ్వక్సేన్ నటించిన సినిమా ఫంకి. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ నాలుగు గంటల 33 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్ ని దృష్టిలో పెట్టుకొని అభిమానులంతా కల్లు కాయలు కాచేలా ఎదురు చూశారు. కానీ చెప్పిన టైం కి రాలేదు.
మొత్తానికి టీజర్ రిలీజ్ అయింది లేట్ అయినా కూడా ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు. కానీ లేట్ అయిన కొద్ది కాలంలో విపరీతంగా బ్యానర్ ని నిర్మాతని కూడా ట్రోల్ చేశారు. టైం సెన్స్ లేదు అంటూ విరుచుకు పడిపోయారు. అసలు ఇదంతా కూడా మొదలైంది వీళ్ళ మెయిన్ బ్యానర్ హారిక హాసిని క్రియేషన్స్ దగ్గర.
అజ్ఞాతవాసి సినిమా టైంలో కూడా విపరీతమైన అంచనాలు ఉన్నప్పుడు ట్రైలర్ చెప్పిన టైంకి రిలీజ్ చేయలేదు. అర్ధరాత్రి 12 గంటలకి అజ్ఞాతవాసి ట్రైలర్ లో అప్పట్లో విడుదల చేశారు. దీనిని బట్టి మిగతా కొన్ని బ్యానర్స్ కూడా దీనినే ఫాలో అయిపోవడం మొదలుపెట్టారు. అప్డేట్ అని చెప్పటం టైం కి రాకపోవడం అలవాటు చేసింది మాత్రం ఇదే బ్యానర్.
Also Read: VDKola : రౌడీ సినిమాకు విముక్తి, రాజుగారు రంగంలోకి దిగుతున్నారు