 
					Bengaluru: నగరాలను పరిశుభ్రంగా ఉంచాలని సోషల్ మీడియాలో పోజులు కొట్టడం కాదు.. పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచనలు చేస్తూనే ఉంటారు. అవి పట్టని జనాలు వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ డంప్ చేసి కాలనీలను అపరిశుభ్రంగా మార్చేస్తారు. కార్మీకులు వచ్చి వాటిని తొలిగించినా, జరిమానాలు విధిస్తామంటూ అధికారులు హెచ్చరించిన పట్టించుకోరు. అయితే కర్ణాటకలోని బెంగళూరులో ప్రజలకు బుద్ది చెప్పేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ(GBA ) వినూత్న చర్యలకు దిగింది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ అధికారులు వివరాల ప్రకారం.. ఎవరైతే వ్యర్థాలను నిర్లక్ష్యంగా వారి ఇంటి పరిసరాల్లో వేస్తారో, వారిని గుర్తించి అదే వ్యర్థాలను వారి ఇంటి ముందు వేస్తారు సిటీ మార్షల్స్. బెంగళూరులో గురువారం సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (BSWML) అధికారులు వ్యర్థాలు బయట పడేసిన సుమారు 200 ఇళ్ల వెలుపల చెత్తను వేశారు. విస్తృత ప్రజా అవగాహన డ్రైవ్‌లో భాగంగా నిర్వహించబడిన ఈ చర్యను “చెత్త డంపింగ్ పండుగ”గా BSWML అభివర్ణించింది.
Read Also: Mumbai: ముంబై లో 20 మంది పిల్లల కిడ్నాప్!
198 వార్డులలో మోహరించిన మార్షల్స్ వ్యర్థాలను పడవేసే వారిని గుర్తించి, సాక్ష్యంగా వీడియో రికార్డింగ్ చేసే పనిని అప్పగించినట్లు సమాచారం. గుర్తించిన తర్వాత, చెత్తను వారి ఇళ్ల వెలుపల పారవేసి సివిల్ రెస్పాన్సిబిలిటి సందేశాన్ని ప్రజలకు చేరవేస్తారు. అలాగే నిబంధనలు ఉల్లంఘించినవారికి ₹10,000 వరకు జరిమానా విధించబడుతుంది. మార్షల్స్ చెత్తను పారవేస్తున్నట్లు చూపించే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జాతీయ పరిశుభ్రత ర్యాంకింగ్స్‌లో బెంగళూరు దారుణంగా పడిపోయింది. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో బెంగళూరు దేశంలోనే అత్యంత మురికి నగరంగా ఐదవ స్థానంలో ఉంది. ఈ క్రమంలోBSWML కఠిన చర్యలకు దిగింది.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలపై నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. “ఇది లంచం తీసుకోవడానికి కొత్త మార్గం. మొదటగా ప్రతి వార్డులో ప్రత్యేక డంపింగ్ స్థలం ఉండాలి ఎందుకంటే చాలా మంది షిఫ్టులలో పని చేస్తారు. పిక్ అప్ వ్యక్తులు వచ్చినప్పుడు (వారు వస్తే) అందుబాటులో ఉండరు. రెండవది గేటు వద్ద చెత్తబుట్ట ఉంచమని చెప్పే వ్యక్తులు కుక్కలు & పిల్లుల గురించి ఆందోళన చెందాలి” అని నెటిజన్లలో ఒకరు అన్నారు.
“చెత్తను తీయడంలో విఫలమైనప్పుడు కూడా ఇదే నియమం వర్తించకూడదా? దానిని GBA అధికారుల ఇంటికి డోర్ డెలివరీ చేయాలి. చెత్త విషయంలో సిటిజన్లకి కామన్ సెన్స్ లేదని అంటున్నారు కానీ నగరంలో మాకు చెత్తను వేయడానికి ప్రత్యేక స్థలాలు లేదా డబ్బాలు కూడా లేవు.” అని మరొక వినియోగదారు కామెంట్ చేశారు.
కర్ణాటకలోని బెంగళూరులో ప్రజలకు బుద్ది చెప్పేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ వినూత్న చర్యలకు దిగింది. ఎవరైతే వ్యర్థాలను నిర్లక్ష్యంగా వారి ఇంటి పరిసరాల్లో వేస్తారో, వారిని గుర్తించి అదే వ్యర్థాలను వారి ఇంటి ముందు వేస్తారు సిటీ మార్షల్స్. pic.twitter.com/54cIg5t2ZU
— vm_updates (@VijayMarka88) October 30, 2025