E-Paper
Advertisement

Saali Mohabbat Review : రాధికా ఆప్టే ‘సాలీ మొహబ్బత్’ మూవీ రివ్యూ

Saali Mohabbat Review : రాధికా ఆప్టే ‘సాలీ మొహబ్బత్’ మూవీ రివ్యూ
Advertisement

Saali Mohabbat Review : రాధికా ఆప్టే, దివ్యేందు శర్మ, అనురాగ్ కశ్యప్ నటించిన “సాలీ మొహబ్బత్” అనే థ్రిల్లర్-డ్రామా ఈరోజు డైరెక్ట్ గా ZEE5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చింది. ఈ చిత్రానికి టిస్కా చోప్రా దర్శకత్వం వహించారు. ఆమెకు దర్శకురాలిగా ఇదే మొదటి చిత్రం కాగా, ఇందులో ఆమె నటించారు కూడా. దీనితో పాటు ఆమె తన భర్త సంజయ్ చోప్రాతో కలిసి ఈ చిత్రానికి రచయితగా కూడా పని చేసింది. ఈ సినిమాను జ్యోతి దేశ్‌పాండే, దినేష్ మల్హోత్రా, విపిన్ అగ్నిహోత్రి సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ 

స్మిత సాధారణ గృహిణి. ఆమె జీవితం తన భర్త చుట్టూనే తిరుగుతుంది. స్మిత తండ్రి చనిపోయినప్పటికీ, తాను పుట్టి పెరిగిన ఇల్లంటే చాలా ఇష్టం. ఇక భర్తకు ఆమె అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. పైగా జూదానికి బానిసై, భయ్యా జీ అనే స్మగ్లర్ దగ్గర అప్పుల ఊబిలో కూరుకుపోతాడు. ఆ అప్పులు తీర్చడానికి స్మితకు ఇష్టమైన ఆమె తండ్రి ఇంటిని అమ్మమని బలవంతం చేస్తాడు. స్మిత భర్త పంకజ్‌ ను తన మామ ఇంటిని అమ్మి అప్పు తీర్చుకోమని ఒత్తిడి తీసుకొస్తాడు భయ్యా. అలాంటి సమయంలో స్మిత బంధువు షాలు ఉద్యోగం నెపంతో అక్కడికి వచ్చినప్పుడు కథ మలుపు తిరుగుతుంది. షాలు రాక పెద్ద ఇల్లు, విలాసవంతమైన జీవితం కావాలని కలలు కనే పోలీస్ ఇన్స్పెక్టర్, పంకజ్, స్మిత జీవితాల్లో అల్లకల్లోలం సృష్టిస్తుంది. ఒక రోజు షాలు, స్మిత భర్త పంకజ్ మృతదేహాలు ఒకేచోట కనిపిస్తాయి. వారిని ఎవరు, ఎందుకు చంపారో తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే.

విశ్లేషణ

Advertisement

కథ చాలా సింపుల్. భర్త అఫైర్ పెట్టుకుంటే భార్య రివేంజ్ ఎలా ఉంటుంది అన్నది స్టోరీ లైన్. మొదటి భాగం స్లోగా సాగుతుంది. మధ్యలో వచ్చే ట్విస్ట్ సస్పెన్స్ ను పెంచుతుంది. కానీ అది పెద్దగా సర్ప్రైజింగ్ గా అన్పించదు. డిసప్పాయింట్ చేసే క్లైమాక్స్ తో సీక్వెల్ హింట్ ఇచ్చారు. దర్శకత్వం పరంగా టిస్కా చోప్రా భర్త ప్రేమ కోసం ఆరాటపడే భార్య, ఆమె జీవితాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్రీకరించడానికి ప్రయత్నించింది. అయితే ప్రామిసింగ్ ప్లాట్ ఉన్నా, వీక్ స్క్రిప్ట్, డైరెక్షన్ వల్ల పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. ఇంతకుముందే ఇలాంటి సినిమాలు బోలెడన్ని వచ్చాయి. కాబట్టి బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్స్ లో లాజిక్ వెతికితే కష్టమే. ఈ సినిమా అంత ప్రత్యేకంగా లేకపోయినా, సమాజంలోని చెడుకు అద్దం పట్టే విధంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2016లో వచ్చిన “చట్నీ” అనే షార్ట్ ఫిల్మ్‌ను పూర్తి మూవీగా మార్చినట్టు ఉంటుంది. ఈ సినిమాకి అతిపెద్ద బలహీనత మ్యూజిక్. ఒక్క పాట కూడా మనసులో నిలిచిపోయేలా లేదు. ఇక సాంగ్స్ వచ్చే చోట ఇప్పుడు అవసరమా ? అన్పిస్తుంది. అమిత్ త్రివేది సస్పెన్స్ ఫుల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టెన్షన్ ను బిల్డ్ చేస్తుంది. ఎడిటింగ్ షార్ప్, కానీ మొదటి భాగం డ్రాగ్ అయ్యింది. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

సినిమాలో ఎక్స్పీరియెన్స్డ్ నటీనటులు ఉండడం ప్లస్ పాయింట్. అన్షుమాన్, దివ్యేందు శర్మతో పాటు రాధికా ఆప్టే, శరత్ సక్సేనా తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. అయితే అనురాగ్ కశ్యప్ రోల్ కు పెద్దగా స్కోప్ లేకపోవడం మైనస్ గా అన్పిస్తుంది. రాధికా ఆప్టే డ్యూయల్ రోల్స్‌లో అదరగొట్టింది.

Advertisement

ప్లస్ పాయింట్స్ 

నటీనటులు
రాధికా ఆప్టే డ్యూయల్ రోల్
రన్ టైమ్

మైనస్ పాయింట్స్ 

రొటీన్ కథ
మ్యూజిక్
మొదటి 30 నిమిషాలు
క్లైమాక్స్

మొత్తానికి
రాధికా ఆప్టే కోసమైనా ఒక్కసారి చూడొచ్చు. కానీ ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే కష్టమే.

Saali Mohabbat Movie Review and Rating : 1/5

Related News

Romanchakam Review : ‘రోమాంచకం’.. నవ్వుల ప్రయాణం..

సుమంత్ ప్రభాస్ ‘రోమాంచకం’ ట్విట్టర్ రివ్యూ..

‘కికు చిరంజీవి’ మూవీ రివ్యూ.. గుండె కుడివైపు ఉంటే.. రహస్యం ఎటువైపు దారితీసింది?

టాక్సిక్’ రివ్యూ.. గీత దాటలేదు, కానీ ఓపిక మాత్రం దాటింది!”

ది రెడ్ బ్యాగ్ మూవీ రివ్యూ.. క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

అమీర్ లోగ్ మూవీ రివ్యూ.. పాతబస్తీ గల్లీ స్నేహం వర్కౌట్ అయ్యిందా?

రవితేజ ‘ఇరుముడి’ రివ్యూ.. అయ్యప్పమాల కలిసొచ్చిందా?

పళ్ళ బురుసు మూవీ రివ్యూ..చిన్న బ్రష్.. పెద్ద గొడవ.. అసలు కథ ఏంటంటే?

Big Stories

Advertisement
×