OTT Movies This Week: ప్రతి నెల కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆగస్టు నెలలో అనుకున్న విధంగా ఏ సినిమా హిట్ అవ్వలేకపోయింది. ఇంక సెప్టెంబర్ నెల నుంచి కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి అందులో ఈమధ్య వచ్చిన లిటిల్ హార్ట్స్ సినిమా పర్వాలేదు అనిపించింది.. ఇక ఈనెల చివరన రాబోతున్న సినిమాలు కాస్త ఆసక్తిగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజి చిత్రం.. నందమూరి హీరో బాలయ్య నటించిన అఖండ 2 సినిమా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. అలాగే మంచు లక్ష‍్మీ ‘దక్ష’, బ్యూటీ, ఇలాంటి సినిమా మీరు ఎప్పుడూ చూసుండరు . ఇక తెలుగు చిత్రాలతో పాటు భద్రకాళి, వీరచంద్రహాస, టన్నెల్ రిలీజ్ కాబోతున్నాయి. ఓటీటీలో కూడా ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేస్తున్నాయి. ఎప్పటిలాగే ఈవారం కూడా బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి.
ఓటీటీ రిలీజ్ అవుతున్న సినిమాల విషయానికొస్తే.. ఈవారం మూవీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు ఏకంగా 15 సినిమాలకు పైగా దేక్ ని లాక్ చేసుకున్నాయి. 28 ఇయర్స్ లేటర్, ఎలియో, ఇంద్ర, హౌస్ మేట్స్ వంటి మూవీస్‌తో పాటు ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్, ష్ సీజన్ 2, ద ట్రయల్ సీజన్ 2 సిరీస్‌లు ఉన్నంతలో ఆసక్తిగా ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
ఎలియో (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 17
సిన్నర్స్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 18
పోలీస్ పోలీస్ (తమిళ సిరీస్) – సెప్టెంబరు 19
ద ట్రయల్ సీజన్ 2 (హిందీ సిరీస్) – సెప్టెంబరు 19
స్వైప్డ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 17
బెలెన్ (స్పానిష్ సినిమా) – సెప్టెంబరు 18
ద బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 18
28 ఇయర్స్ లేటర్ (ఇంగ్లీష్ సినిమా) – సెప్టెంబరు 20
ఇంద్ర (తమిళ సినిమా) – సెప్టెంబరు 19
మాటొండ హెలువే (కన్నడ మూవీ) – సెప్టెంబరు 19
ష్ సీజన్ 2 (తెలగు సిరీస్) – సెప్టెంబరు 19
హౌస్‌మేట్స్ (తమిళ సినిమా) – సెప్టెంబరు 19
ద మార్నింగ్ షో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 17
ద సర్ఫర్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 19
Also Read : ఈ వారం ఊహించని రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటంటే..?
మూవీ లవర్స్ కి ఈవారం పెద్ద పండగనే చెప్పాలి.. దాదాపు ఐదు, ఆరు సినిమాలు ఆసక్తిగా ఉన్నాయి.. కేవలం మూడు సినిమాలు ప్రేక్షకులను చూపుతిప్పుకొని ఇవ్వకుండా చేస్తున్నాయి. మొత్తానికి ఈ వారం మంచి సినిమాలే రావడంతో జనాలు వీటిని చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.. అటు థియేటర్లలో కూడా ఈనెల బోలెడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. పవన్ కళ్యాణ్, బాలకృష్ణల మధ్య టఫ్ వార్ జరగనుందని తెలుస్తుంది. ఇద్దరు నటిస్తున్న రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కాబోతున్నాయి. ఏ హీరో సినిమా విన్నర్ గా నిలుస్తుందో.. ఏ హీరో సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందో చూడాలి..