BigTV English

Bigg Boss 9 Telugu : తినడం కోసమే బిగ్ బాస్ కు వస్తారా? భరణిపై ఎందుకు అంత పగ..?

Bigg Boss 9 Telugu : తినడం కోసమే బిగ్ బాస్ కు వస్తారా? భరణిపై ఎందుకు అంత పగ..?

Bigg Boss 9 Telugu : బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 9వ సీజన్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఒక వారం అయిపోయిన ఈ షో రెండో వారం నామినేషన్స్ హీటెక్కించాయి. సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రచ్చ రణరంగంగా మారింది.. చూస్తుంటే ఎక్కువమంది సెలబ్రిటీలను టార్గెట్ చేశారు. ఏ విధంగా మాస్క్ మెన్ ని టార్గెట్ చేయడం పై సర్వత్ర అనుమానాలు వ్యక్తబోతున్నాయి. అందరిలో కల్లా ఎక్కువగా హరీష్ కే రంగు పడింది. అటు సెలబ్రిటీల భరణిని ఎక్కువగా టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే మరి ఈ వారం నామినేషన్స్ ఎలా జరిగాయి. ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అన్నది ఆసక్తిగా మారింది.. ఆడియన్స్ లో మాత్రం ఈ వారం హరీష్ బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


రెండో వారం భరణి టార్గెట్..?

గత సీజన్లో ఫుడ్డు కోసం గుడ్డు కోసం అంటూ గొడవలు పడ్డారు. ఇప్పుడు కూడా సేమ్ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. బిగ్ బాస్ సెలబ్రిటీల ఫుడ్ విషయంలో పార్శాల్టి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.. సామాన్యులకు ఇచ్చినంత ఫ్రీడమ్ సెలబ్రిటీలకు ఇవ్వడం లేదు. భరణి మీద నామినేషన్స్ పాయింట్స్ ఓనర్స్ అని పిలువబడుతున్న సామాన్యులే గుడ్డు సంఘటన ని ఆధారంగా చేసుకొని టార్గెట్ చేసి మరీ నామినేషన్ వేశారు. మనీష్ అనే వ్యక్తి అయితే అత్యంత దారుణంగా ప్రవర్తించాడు. మొత్తానికి సెకండ్ వీక్ నామినేషన్ లో ఎక్కువ మంది భరణిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.

Also Read :  భాగ్యం ప్లాన్ సక్సెస్.. ప్రేమ కోసం ధీరజ్ షాకింగ్ నిర్ణయం.. చందు, వల్లి మధ్య దూరం మాయం…


ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే..? 

సెకండ్ వీక్ నామినేషన్స్ లో దాదాపు 8 మంది డేంజర్ లో ఉన్నారు. అంటే ఈ వారం నామినేషన్ లో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో ముఖ్యంగా మనీష్, భరణి, హరీష్ ముగ్గురు డేంజర్ లో ఉన్నట్లు ఓటింగ్ అని చూస్తే అర్థమవుతుంది. ఆరు మంది సామాన్యులు భరణి అసలు మంచి వాడే కాదు, పాము లాంటోడు అని ముద్ర వేయడానికి చూసారు.. తన బాడీతో తన మాటలతో అందరినీ ఒక తిప్పు తిప్పాల్సిన భరణి మౌనంగా ఉండడం పై బిగ్ బాస్ ఆడియన్స్ కు అనుమానం వ్యక్తం అవుతుంది. నిజంగానే భరణిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అర్థం కాక జుట్లు పీక్కుకుంటున్నారు.. అటు హరీష్ ని కూడా హౌస్ మేట్స్ ను టార్గెట్ చేసి రంగు పూశారు.. మొత్తానికి మనీషు హరీష్ భరణి ఈ ముగ్గురు డేంజర్ లో ఉన్నట్లు గత కొన్ని ఎపిసోడ్లను చూస్తే అర్థమవుతుంది. మరి ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటికి వెళ్తారు అన్నది తెలియాలంటే ప్రతి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాల్సిందే.. ఏది ఏమైనా కూడా సీజన్ 9 బిగ్ బాస్ జనాలని ఎంటర్టైన్ చేయలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ ముందు ముందు కఠినతరమైన టాస్కులను ఇస్తారేమో చూడాలి..

Related News

Bigg Boss 9: ముద్దుల వర్షం కురిపించిన ఇమ్ము.. తనూజా ఏం చేసిందంటే?

Bigg Boss 9 : దమ్ముంటే బిగ్ బాస్ ని అడగండి, ఆడవాళ్ళందరూ కలిసి మాస్క్ మెన్ పై రెచ్చిపోయారు

Bigg Boss 9 : అమ్మ బాబోయ్ ఇది వేరే లెవెల్. గుండు అంకుల్, రెడ్ ఫ్లవర్ పంచాయతీ ఇంకా తెగలేదు 

Bigg Boss 9 : నీకు నచ్చినట్టు నేను ఉండను, రీతు చౌదరి రెచ్చిపోయిందిగా..

Bigg Boss 9 Promo: నరాలు కట్ అయ్యే ప్రోమో, ఈరోజు ఎపిసోడ్ రచ్చ రచ్చే

Bigg Boss 9: బాడీ షేమింగ్ తో హీటెక్కిన నామినేషన్.. మూల్యం తప్పదా?

Bigg Boss 9: మాస్క్ మ్యాన్‌కు రంగు పడింది.. ఏడ్చేసిన రీతూ చౌదరి, వాడివేడిగా నామినేషన్స్

Big Stories

×