Mirai Movie First Review: సూపర్ హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్’ (Mirai Movie). హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కుర్ర హీరో నుంచి వస్తున్న చిత్రమిది. దీంతో ప్రకటనతోనే మిరాయ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్, టీజర్, మూవీపై మంచి బజ్ పెంచాయి. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ మిరాయ్పై ఒక్కసారిగా అంచాలు పెరిగిపోయాయి. ట్రైలర్ (Mirai Trailer) చూపించిన భారీ విజువల్స్కి ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక చివరిలో చూపించిన రాముడి పాత్రతో మూవీపై సస్పెన్స్ నెలకొంది. దీంతో మిరాయ్ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి.
ఘాటీ, మదరాసి వంటి చిత్రాలు కూడా విడుదలకు లైన్లో ఉన్నాయి. కానీ, వీటన్నీంటికి కంటే కూడా మిరాయ్పైనే విపరీతమైన బజ్ ఉంది. ఆ క్రేజ్ ఐఎండీబీలోనూ కనిపిస్తోంది. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైయిటెట్ చిత్రంగా మిరాయ్ టాప్‌లో ఉంది. ఇంకా సినిమాకు కొన్ని రోజులే ఉంది. సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. దీంతో ఈ సినిమా కథ, కథనంపై ఆడియన్స్లో క్యూరిసిటీ నెలకొంది.
మూవీ రిలీజ్ కి కొన్ని రోజులే ఉండటంతో.. మిరాయ్ ఫస్ట్ రివ్యూ బయటకు వచ్చింది. ఇటీవల ఈ సినిమాని చూసిన సినీ వర్గాలు మూవీకి గురించి చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం నిఖిల్ కార్తికేయ 2, ప్రశాంత్ వర్మ ‘హనుమాన్ చిత్రాల రేంజ్లో ఉంటుందట. అక్కడ అక్కడ కొన్ని సీన్స్ అచ్చం హనుమాన్ మూవీని తలపిస్తాయట. ముఖ్యంగా ఇందులో వాడిన భారీ విజువల్స్ ఆడియన్స్ కి అద్భుతమైన అనుభూతిని అందిస్తాయట.
ఇక మైథలాజికల్ డ్రామాకి సూపర్ హీరో జానర్ టచ్ చేశారు. అలా మూవీని ఓపెనింగ్ సీన్‌తోనే డైరెక్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాడు. ఆడియన్స్ ఎక్కడ డివియేట్ అవ్వకుండ స్క్రీన్ ప్లేని అద్భుతంగా చూపించాడట. అయితే సెకండాఫ్ మాత్రం కాస్తా ఆడియన్స్ని బోర్ కొట్టించోచ్చు అంటున్నారు. హీరో లేకుండ సెకండాఫ్లో కొంత పోర్షన్ ఉందట. అది ఆడియన్స్ని కాస్తా విసుగు తెప్పించోచ్చని అంటున్నారు. కానీ, ఓవరాల్గా మాత్రం మిరాయ్ సూపర్ మూవీ అని. ఈ కుర్ర హీరో ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ ఖాయం అంటున్నారు. మరి సెప్టెంబర్ 12న మిరాయ్ ఎలాంటి అద్బుతం చేస్తుందో చూడాలి. కాగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. పీపుల్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 1 2న ఈ చిత్రం సుమారు ఎనిమిది భాషల్లో విడుదల కానుంది.
Also Read: Ghaati Censor Report: అనుష్క ‘ఘాటీ’కి సెన్సార్ కట్స్.. ఆ సీన్లపై కోత.. మొత్తం మూవీ నిడివి ఎంతంటే!