Ghaati Completes Censor: టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కన లేటెస్ట్ మూవీ ‘ఘాటీ‘. యాక్షన్, క్రైం డ్రామాగా రూపోందిన ఈ చిత్రం సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ఈమూవీ ప్రచార పోస్టర్స్, గ్లింప్స్, టిజర్, ట్రైలర్ మూవీపై మంచి బజ్ పెంచాయి. ఇక విడుదలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఘాటీ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. రెండు రోజుల క్రితమే మూవీ సెన్సార్ పూర్తి కాగా.. తాజాగా బోర్టు జారీ చేసిన సర్టిఫికేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు బోర్డు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. అయితే ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు.. మూవీపై ప్రశంసలు కురిపించారట. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్లకు కట్ విధించారు.
కట్ చెప్పిన సీన్స్ ఏంటంటే..
కొన్ని అభ్యంతరకర, వయిలెన్స్ సీన్స్‌కి తీసేసి.. వాటి ప్లేస్లో కొన్ని సీన్స్ చేర్చారట. మొత్తంగా ఘాటీ మూవీకి దాదాపు 9 సీన్స్పై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. ఘాటీ సినిమాలో వైయిలెన్స్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో అనుష్క ఫుల్ వైయిలెన్స్లో కనిపించింది. బస్సులో ఓ వ్యక్తి మెడను పరపర కోసే సీన్ ఎంత భయంకరంగా చూపించారో టీజర్, ట్రైలర్ చూశారు. అయితే ఇప్పుడు అదే సీన్పై సెన్సార్ అభ్యంతరం తెలిపింది. అది తీసేసి దాన్ని మరో సీన్ని రీప్లేస్ చేశారట. అలాగే సినిమా ప్రారంభంలో వచ్చే నిరాకరణ (Disclaimer) ని వాయిస్ ఓవర్ ఇప్పించి దానిని చేర్చారు. గంజాయి వాడకాన్ని హెచ్చరిస్తూ ఇచ్చే ఫాంట్ సైజ్‌ని పెంచారు.
అనుష్క సీన్ పై బోర్డు అభ్యంతరం
ఈ చిత్రంలో వాడిన అభ్యంతకర పదం (ర*** మొగుడు) పదాన్ని, సబ్ టైటిల్ మ్యూట్ చేయాలని బోర్డు సభ్యులు మూవీ టీంకి సూచించారు. స్కూల్ పిల్లలు గంజాయి తాగుతున్నట్టు చూపించిన సన్నివేశాన్ని తొలగించి.. దాన్ని మరో సీన్తో రీప్లేస్ చేశారు. ఓ సీన్లో పదే పదే కత్తితో పోడిచినట్టు చూపించిన విజువల్ నిడివిని తగ్గించారు. అలాగే అనుష్క ఓ వ్యక్తి మెడ కోస్తున్న సీన్, వయిలెన్స్, పదే పదే కత్తితో పోడిచే సీన్స్ని నిడివి తగ్గించి సీజీతో కవర్ చేయమని తెలిపింది. రక్తం పారే వయిలెన్స్ సీన్స్ తీసేసి దాని స్థానంలో ప్రత్యామ్నయంగా మరో సీన్ చేర్చమని బోర్డు సూచించింది.
సెన్సార్ బోర్డు చెప్పిన కట్స్తో మొత్తం మూవీ నిడివిలో 11 సెకన్ల తగ్గింది. దానికి ప్రత్యామ్నయంగా మరో సీన్స్లో మూవీ టీం రీప్లేస్ చేసింది. అలా 11 సెకన్ల నిడివి సీన్స్ తీసేసి.. 11 సెకన్ల సీన్స్ చేర్చారట. దీంతో ఫైనల్గా ఘాటీ మూవీ నిడివి 156 నిమిషాల అంటే 2 గంటల 36 నిమిషాలు ఉంది. ఇలా పలు యూ/ఏ సర్టిఫికేట్ని జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమాలో అనుష్క ప్రధాన పాత్రలో నటించగా.. విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటించాడు. నటుడు చైతన్య రావు ప్రతికథానాయకుడి పాత్ర పోషించాడు. ఈ సినిమాను అడవిలోని కొండప్రాంతాల ప్రజల జీవిన శైలిని చూపించారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారిని ఘాటీలు అంటారని, వారి జీవన శైలి, వ్యాపారం వంటి నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. యూవీ క్రియేషన్స్ బ్యా నర్లో ఈ చిత్రం రూపొందింది.