Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. నిత్యం వేలాది మంది ప్రయాణీకులకు ఆహ్లాదకరమైన రవాణా సౌకర్యాన్ని అందిస్తుంది. వర్షాలు, వరదల నేపథ్యంలో చాలా మంది పెద్ద సంఖ్యలో మెట్రోను ఆశ్రయిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుతున్నారు. ప్రయాణీకులకు మెరుగైన రవాణా అందించడమే కాదు, అత్యవసర పరిస్థితులలో పలువురి ప్రాణాలు కాపాడటంలో సాయపడుతుంది. తాజాగా హైదరాబాద్ మెట్రో ఇద్దరు ప్రాణాలను నిలపడంలో కీలక పాత్ర పోషించింది.
మెట్రోలో గుండె, ఊపిరితిత్తుల తరలింపు
ఎమర్జెన్సీలో మానవ అవయవాలను వేగంగా చేరవేస్తూ రోగుల ప్రాణాలు నిలపడంలో మెట్రో ముందుంటుంది. తాజాగా మెట్రో గ్రీన్ చానెల్ ద్వారా గుండె, ఊపిరితిత్తులను రవాణా చేసి ఇద్దరి ప్రాణాలు కాపాడింది. మంగళవారం రాత్రి 9-10 గంటల ప్రాంతంలో ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి వేర్వేరు ఆసుపత్రులకు గుండె, ఊపిరితిత్తులను అత్యంత వేగంగా తీసుకెళ్లేలా సాయపడింది. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి గుండెను 11 కిలో మీటర్ల దూరంలోని సికింద్రాబాద్ యశోదకు 16 నిమిషాల్లో తీసుకెళ్లింది. అదే సమయంలో ఊపిరితిత్తులను 27 కి.మీ. దూరంలోని మాదాపూర్ యశోదకు 43 నిమిషాల్లో చేరవేసింది. ఇద్దరు రోగుల ప్రాణాలను నిలబెట్టింది. ఈ విషయాన్ని హైదరాబాద్ మెట్రో సంస్థ అధికారికంగా వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో ఇద్దరి ప్రాణాలు కాపాడటంలో సంతోషంగా ఉందన్నారు. అటు మెట్రో తీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also: ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ బెస్ట్, మరి వరెస్ట్ నగరం ఏదో తెలుసా?
🚆 27 KM, 43 Minutes, 21 Stations – 2 Lives Saved ❤️🫁
On 2nd September 2025, Hyderabad Metro proudly enabled a priority medical transit for a life-saving heart and lungs transplant, ensuring the swift transportation of donor organs from Kamineni Hospitals, LB Nagar, to Yashoda… pic.twitter.com/302ApioI3S— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 2, 2025
Read Also:ఉమెన్ సేఫ్టీలో వైజాగ్ బెస్ట్, మరి వరెస్ట్ నగరం ఏదో తెలుసా?