BigTV English

Hari Hara Veera Mallu: పార్ట్ 2 రావాలంటే అలాంటి కండిషన్స్.. వర్కౌట్ అవుతుందా

Hari Hara Veera Mallu: పార్ట్ 2 రావాలంటే అలాంటి కండిషన్స్.. వర్కౌట్ అవుతుందా

Hari Hara Veera Mallu:దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెరపై కనిపించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎంతో ప్రతిష్టాత్మకంగా.. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా ఈ సినిమాను విడుదల చేశారు. జూలై 24వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్ తో దూసుకుపోతోంది. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్య విడుదల కాకముందే ఎన్నో విమర్శలు, వివాదాలు ఎదుర్కొంది. కానీ ఎట్టకేలకు అన్నింటిని తిప్పి కొట్టి థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్లో పార్ట్ 2 పై అంచనాలు పెంచేస్తూ సినిమా టైటిల్ ని కూడా రివీల్ చేశారు. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ దాదాపు 30% పూర్తయిందని కూడా చెప్పారు. అయితే ఇలాంటి సమయంలో ఇప్పుడు కండిషన్స్ అంటూ మళ్ళీ అనుమానాలు రేకెత్తిస్తున్నారు చిత్ర బృందం. అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


వీరమల్లు పార్ట్ 2 రావాలంటే కండిషన్స్ అప్లై..

అసలు విషయంలోకి వెళ్తే హరిహర వీరమల్లు పార్ట్ 2 కి ‘యుద్ధభూమి’ అని నామకరణం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వచ్చిన ఫీడ్ బ్యాక్ ను తీసుకొని పార్ట్ 2 కి జాగ్రత్త పడతామని అటు పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. దీంతో అందరూ రెండో భాగం ఎప్పుడెప్పుడా అని అడుగుతున్నారని దర్శకుడు జ్యోతి కృష్ణ (Jyoti Krishna) కూడా చెప్పుకొచ్చారు. అయితే సీక్వెల్ తెరకెక్కడం అనేది కొన్ని సమీకరణాల మీద ఆధారపడి ఉంటుందని సమాచారం ..మొదటిది ముందు పార్ట్ 1 పూర్తిగా బ్రేక్ ఈవెన్ దాటేసి, మొత్తం పెట్టుబడి రికవరీ కావాలి. నష్టాలు లేకుండా సినిమా గట్టెక్కాలి. ముఖ్యంగా నిర్మాత ఏ.ఎం.రత్నంకి కావలసిన అంత బడ్జెట్ పెట్టే భరోసా మార్కెట్ నుంచి లభించాలి. అన్నింటికంటే పవన్ కళ్యాణ్ డేట్ లు కావాలి. అయితే ప్రాక్టికల్ గా ఇది అంత సులభం కాదు. అలా అని అసాధ్యం కాదు అని చెప్పలేము. ఇక ఈ కండిషన్స్ అన్ని వర్కౌట్ అయితేనే.. హరిహర వీరమల్లు ‘యుద్ధభూమి’ కి సాధ్యమవుతుంది. మరి ఈ సినిమా వీటన్నింటినీ దాటుకొని త్వరలోనే ఆడియన్స్ ముందుకు రావాలి అని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.


హరిహర వీరమల్లు కలెక్షన్స్..

ఇక హరిహర వీరమల్లు సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. ప్రీమియర్ షో ద్వారా రూ.12.75 కోట్లు రాబట్టింది ఈ సినిమా. ప్రీమియర్స్ తో కలిపి అన్ని భాషలలో మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు వసూలు చేసింది. శుక్రవారం రోజున రూ.18 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. ఇక మొత్తంగా ఇప్పటివరకు రూ.76 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన ఈ సినిమా శనివారానికి రూ.100 కోట్ల క్లబ్లో చేరనుంది అని తెలుస్తోంది. ముఖ్యంగా చాలా చోట్ల వర్షాలు అధికంగా రావడం మరొకవైపు మిక్స్డ్ టాక్ రావడంతో కాస్త కలెక్షన్స్ తగ్గినట్లు సమాచారం. అయినా సరే వారాంతంలోపే రూ.100 కోట్ల క్లబ్లో చేరనుంది అని చెప్పవచ్చు.

ALSO READ:Niharika: విడాకులపై తొలిసారి స్పందించిన నిహారిక.. నరకం అనుభవించే వారిదే!

Related News

Coolie: ట్రెండ్ సెట్ చేసిన మోనికా సాంగ్.. ఎవరీ మోనికా బెలూచీ?

War 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బ్రేక్!

Allu Arjun: అల్లుఅర్జున్‌కు అధికారుల షాక్.. నేనొక ఫేమస్ నటుడ్ని, అయినా వినలేదు

Film industry: కాల్పుల్లో ప్రముఖ రాపర్ సింగర్ మృతి!

Coolie Vs War 2: రాజకీయ చిచ్చు లేపిన లోకేష్.. ఎన్టీఆర్ ను దెబ్బతీయడానికేనా?

War 2: ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం.. కానీ ఆంక్షలు తప్పనిసరి!

Big Stories

×