BigTV English

foods for Vitiligo: ఈ ఐదు రకాల ఆహారాలు తిన్నారంటే బొల్లి మచ్చలు మరింత పెరిగిపోతాయి, జాగ్రత్త

foods for Vitiligo: ఈ ఐదు రకాల ఆహారాలు తిన్నారంటే బొల్లి మచ్చలు మరింత పెరిగిపోతాయి, జాగ్రత్త

బొల్లి అనేది ఒక చర్మవ్యాధి. దీనిని పూర్తిగా నయం చేసే మందులు లేవు. ఒకసారి వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. అంతేకాదు ఇది శరీరమంతా పాకే అవకాశం కూడా ఉంది. బొల్లి వ్యాధి ఉన్నవారిలో చర్మం రంగును తగ్గించే మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం చాలావరకు ఉత్పత్తి కాకుండా ఆగిపోతుంది. దీని కారణంగానే చర్మంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయి.


ఈ బొల్లి మచ్చల వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వారిలో ఆత్మవిశ్వాసం కూడా లోపిస్తుంది. దీనికి చికిత్స సాధ్యం కాదు. కానీ ఇది ఇతర శరీర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. అయితే బొల్లి మచ్చలతో బాధపడేవారు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి.

పుల్లని ఆహారాలు
బొల్లి మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారు పుల్లగా ఉండే పండ్లకు దూరంగా ఉండాలి. నిమ్మ, నారింజ, టమోటో, చింతపండు వంటి వాటిని తక్కువగా తినాలి. దీనిలో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఇది మెలనిన్ ఉత్పత్తిని అడ్డుకుంటాయి. బొల్లి మచ్చలను మరింతగా పెంచుతాయి. కాబట్టి పుల్లని పదార్థాలు చాలా తక్కువగా తింటే మంచిది. పూర్తిగా మానేసిన ఉత్తమమే.


పాలు – చేపలు
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం పాలు, చేపలు ఒకే సమయంలో తినకూడదు. పాలు తాగిన తర్వాత చేపల కూర తినడం లేదా చేపల కూర తిన్నాక పాలతో చేసిన టీనే లేదా కాఫీని తాగడం వంటివి చేయకూడదు. ఈ రెండింటి కలయిక ఆమ్ల ప్రభావానికి దారితీస్తుంది. ఇది చర్మ సమస్యలను పెంచుతుంది. మెలనిన్ ఉత్పత్తిని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి బొల్లి ఉన్న వ్యక్తులు పాలు, చేపలను ఒకే సమయంలో లేదా రెండు మూడు గంటల వ్యవధిలో తీసుకోకూడదు. చేపలు తిన్న రోజు పాలతో చేసిన ఆహారాలకు దూరంగా ఉండటమే ఉత్తమం.

జంక్ ఫుడ్
ఇప్పుడు జంక్ ఫుడ్ అధికంగా తింటున్నారు. చిప్స్, పిజ్జా, బర్గర్లు, కూల్ డ్రింకులు వంటివి అన్నీ ప్రాసెస్ చేసిన ఆహారాల జాబితాలోకి వస్తాయి. వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బలహీనంగా మారిపోతుంది. అంతేకాదు చర్మాన్ని కూడా దెబ్బతీస్తుంది. బొల్లి అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. వీటికి దూరంగా ఉంటేనే బొల్లి మచ్చలు వ్యాపించకుండా ఉంటాయి.

మైదా వంటకాలు
మైదాతో చేసిన పిండి వంటలు లేదా పంచదారతో చేసిన ఆహారాలు తినడం చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. నేరుగా చర్మ ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని కూడా తగ్గిస్తాయి. దీనివల్ల తెల్లటి మచ్చలు మరింతగా వ్యాప్తి చెంది అవకాశం ఉంది.

ఉప్పు, కారం అధికంగా ఉండే ఆహారం
తినే ఆహారంలో ఉప్పును, కారాన్ని చాలా పరిమితంగా వేసుకోవాలి. ఉప్పునూ, కారాన్ని అధికంగా తీసుకుంటే చర్మంపై చికాకు, వాపు, ఇన్ఫ్లమేషన్ కలుగుతుంది. తెల్లటి మచ్చల సమస్య ఇంకా పెరిగిపోతుంది. కాబట్టి సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు వంటివి తీసుకుంటే బొల్లి సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×