Mirai Train Action Making Video: సూపర్ హీరో తేజ సజ్జా హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. గతేడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అగ్ర హీరోతో పోటీ పడిన ఈ కుర్ర హీరో చివరికి తనదై పైచేయి అనిపించుకున్నాడు. మైథలాజికల్ యాక్షన్ డ్రామాకు సూపర్ హీరో జానర్ని జతచేసిన తెరకెక్కించిన ప్రశాంత్ వర్మ ప్రయత్నం బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో ఈ హనుమాన్ బాక్సాఫీసు వద్ద రికార్డు వసూళ్లు చేశాడు. మొత్తం రూ. 450పైగా కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. హనుమాన్ తర్వాత మరోసారి సూపర్ హీరో జానర్నే ఎంచుకున్నాడు తేజ సజ్జా. మిరాయ్ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు రాబోతుడు.
దీంతో ఈ మూవీపై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈగల్ ఫేం కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. సెప్టెంంబర్ 12న వరల్డ్ వైడ్‌గా సుమారు 13 భాషల్లో మిరాయ్ విడుదల అవుతుంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేస్తుంది. తేజ సజ్జా నేషనల్ వైడ్ పర్యటిస్తున్నాడు. ఇటీవల ముంబై వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు. కాగా మిరాయ్ హిందీ రైట్స్ని ప్రముఖ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ సొంతం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మిరాయ్ పై బజ్ మరింత పెరిగింది. ప్రస్తుతం ప్రమోషన్స్తో ఫుల్ బిజీగా ఉన్న మేకర్స్.. తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. మూవీ రిలీజ్ కి ఇంకా రెండు రోజులు ఉందనగా.. మిరాయ్ మేకింగ్ వీడియో షేర్ చేశాడు. ఈༀచిత్రంలో ట్రైయిన్ యాక్షన్ సీక్వెన్స్ కి సంబంధించిన మేకింగ్ వీడియో షేర్ చేసి సినిమాపై మరింత హైప్ పెంచారు.
మూవీలోనే ఇది కీలక సన్నివేశం. కదులుతున్న ట్రైయిన్ పై తేజ సూపర్ హీరోలా విలన్స్ దాడి చేశాడు. ఈ యాక్షన్ సీక్వెన్స్ స్వయంగా తేజనే చేశాడట. ఎలాంటి డూప్ లేకుండ భయంకరమైన స్టంట్స్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా స్టంట్ మాస్టరే వీడియో వివరించారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం టీం ఎంత కష్టపడింది.. ప్రతి షాట్ విషయంలో డైరెక్టర్ తీసుకున్న జాగ్రత్తలు, పర్ఫెక్షన్ కోసం ఆయన పడ్డ తపనంతా వీడియోలో చూపించారు. యాక్షన్ సీక్వెన్స్ గురించి ఫైట్ మాస్టర్ వివరించాడు. “మొదటి నుంచి మాకు మిరాయ్ ఫైట్ సీక్వెన్స్ ఛాలెంజింగ్‌గానే ఉన్నాయి. ప్రతి సీన్ పర్ఫెక్షన్ ఉండాలి. ముఖ్యంగా ట్రెయిన్ యాక్షన్ సీక్వెన్స్ మాకు అతిపెద్ద సవాళు. ఇది కేవలం యాక్షన్ సీన్ కాదు. సినిమాకే టర్నింగ్ పాయింట్ ఇది. అందుకే ఈ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడం మాకు పెద్ద సవాళు. కదులుతున్న రైలుపై ఫైట్ సీన్ అంటే సాధారణం విషయం కాదు.
అది పర్ఫెక్ట్గా రావాలి. హీరో తేజ సజ్జ ఈ సీన్ కోసం చాలా కష్టపడ్డాడు. సంట్స్, యాక్షన్ ఎలాంటి డూప్ లేకుండ నటించాడు. కదులుతున్న రైలుపైకి ఎక్కడం, రైలుకు వెలాడబటం.. వరకు అన్ని రియల్గా చేశాడు. ఎలాంటి డూప్ లేకుండ రియల్గా నటించాడు. అతడి డెడికేషన్, మూవీ పట్ల తనకి ఉన్న నిబద్దతకు హ్యాట్పాఫ్. ఇక దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని ప్రతీ సీన్, షాట్ పర్ఫెక్షన్కు ఎంతో కృష్టి చేశాడు. ఆయన విజన్, పర్ఫెక్సన్ మీరు సెప్టెంబర్ 12న మిరాయ్లో చూస్తారు. రియల్ ఎఫర్ట్స్, రియల్ బ్లడ్, చెమట… ఆశయం ఎంత పెద్దది అయితే.. ప్రమాదం అంత ఎక్కువగా అంటూ చెప్పుకొచ్చాడు. దీనికి క్యాప్షన్ కూడా అదే పెడుతూ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. కాగా ఈ సినిమాలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్, శ్రియ శరణ్లు కీలక పాత్రలో నటించిన ఈ సిరిమా రిత్విక నాయక్ హీరోయిన్గా నటించింది. పీపుల్స్ మీడియా పతాకంపై టీజీ విశ్వప్రసాద్, క్రతి ప్రసాద్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==