Samruddhi Mahamarg: సమృద్ధి మహామార్గ్‌పై ఇటీవల టైర్లు పేలిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ వార్తపై మహారాష్ట్ర రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MSRDC) క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో అపోహలు వ్యాప్తి చెందకుండా చూడాలనే ఉద్దేశంతో అక్కడ పరిస్థితిని వివరించారు.
అక్కడ జరిగింది ఇదీ..
సమృద్ధి మహామార్గ్‌లో చైన్ నంబర్ 442+460 సమీపంలోని రెండు లేన్‌లలో చిన్న చీలికలు కనిపించాయి. రోడ్డు నాణ్యతను కాపాడేందుకు ఈ చీలికలను ఇపాక్సీ గ్రౌటింగ్ ద్వారా పూర్చడం జరిగింది. ఈ పనికి అల్యూమినియం నోజిల్స్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అక్కడ జరుగుతున్న పనుల సమయంలో ట్రాఫిక్‌ను పలు మార్గాల్లో మళ్లించారు. అయినప్పటికీ, కొన్ని వేగంగా వెళ్తున్న వాహనాలను నిబంధనలను పాటించక, మొదటి లేన్‌లోకి దూసుకెళ్లాయి. దీనివల్ల అల్యూమినియం నోజిల్స్ పై వెళ్ళిన వాహనాల టైర్లు చీలిపోయాయి. ఈ ఘటన 10 సెప్టెంబర్ మధ్యాహ్నం 12.10 గంటలకు జరిగింది. హైవే పేట్రోల్ టీమ్ 25 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి గాయాలు కాలేదని తెలిపారు.
ఉద్దేశపూర్వకంగా జరగలేదు
MSRDC తెలిపినట్లుగా, రిపేర్ కోసం ఉపయోగించిన అన్ని అల్యూమినియం నాజిల్స్ 10 సెప్టెంబర్ ఉదయం 5 గంటలకు తొలగించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ సక్రమంగానే నడుస్తోంది. టైర్ పంచర్లు అల్యూమినియం (నాజిల్స్) పరికరాల వల్ల సంభవించాయి. అక్కడ అమర్చిన నీల్స్ (small aluminium nozzles) వల్ల కాదని స్పష్టం చేశారు. రోడ్డు మీద ఉద్దేశపూర్వకంగా టైర్స్ పంచర్స్ చేయడానికి ఎలాంటి నీల్స్ పెట్టలేదు. అదనంగా, డైవర్షన్ పాయింట్ వద్ద సరైన ట్రాఫిక్ సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోవడం కూడా సమస్యకు కారణమని గుర్తించారు. కాబట్టి, ఆ సైట్ నిర్వహణకు బాధ్యత వహించిన కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
జాగ్రత్తలు పాటించండి
వైరల్ రిపోర్ట్స్ వలన వాహనదారులు, స్థానికులు భయ భ్రాంతికి గురయ్యారని MSRDC తెలిపింది. ఎప్పుడూ రోడ్డు డైవర్షన్ సూచనలను గౌరవించండి, స్పీడ్ పరిమితులను పాటించాలని ప్రజలను సూచించింది. ఇటువంటివి పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉంటాయని పేర్కొంది. హెచ్చరికలకు అనుగుణంగా ప్రయాణించడం తప్పనిసరిగా చేయాలని MSRDC సూచించింది.
MSRDC कडून स्पष्टीकरण आले आहे, समृद्धी महामार्गावर तडे गेले ,त्याचे काम करण्यासाठी नोजल्स लावले होते. त्यामुळे गाड्यांचे टायर फुटले! समृध्दी महामार्गाला तडे का जातात? वारंवार त्यावर काम का निघत? नोजल्स लावले ,काम सुरू आहे हे ड्रायव्हर ,प्रवाशांना कस कळणार? काम सुरू आहे तर… pic.twitter.com/WcyYGicqln
— Rashmi Puranik (@Marathi_Rash) September 10, 2025