Nellore: నెల్లూరులో జంట హత్య కలకలం రేపింది. పెన్నా నది సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇద్దరిని హత్య చేసి పెన్నానదిలో పడేశారు. రోడ్డు పై ఉన్న రక్తపు మరకలు గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని మృతదేహాలను హాస్పటల్‌కి తరలించారు. పోలీసులు ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.