OTT Movie : ఓటీటీలోకి అదిరిపోయే కంటెంట్ తో థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. వీటిని మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు థ్రిల్లర్ అభిమానులు ఈ నేపథ్యంలో ఒక తమిళ థ్రిల్లర్ మూవీ థియేటర్లలో సందడి చేసి, నెల తిరక్కుండానే ఓటీటీలో దూసుకుపోవడానికి వచ్చేసింది. ఏకంగా ఈ సినిమా మూడు ఓటీటీలలో రేపటి నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది. ఈ సినిమా ఒకగ్రామంలో చనిపోయిన ఒక శవం చుట్టూ తిరుగుతుంది. ఆ శవం చుట్టూ సౌండ్స్ రావడంతో అసలు సమస్య మొదలవుతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించడం విశేషం. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
‘బాంబ్’ (Bomb)2025లో విడుదలైన తమిళ థ్రిల్లర్ సినిమా. దీనికి విశాల్ వెంకట్ దర్శకత్వం వహించారు. ఇందులో ఆర్జున్ దాస్,
కాళి వెంకట్ శివత్మిక రాజశేఖర్, నాసర్, అభిరామి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయింది. IMDbలో 8.2/10 రేటింగ్ ని కూడా పొందింది. ఆహా తమిళ్, సింప్లీ సౌత్, షార్ట్ ఫ్లీక్స్ ఓటీటీలో అక్టోబర్ 10 నుంచి స్ట్రీమింగ్ అవ్వబోతోంది.
Read Also : మరికొన్ని గంటల్లో ఓటీటీలో ‘సెర్చ్’… ఈ సిరీస్ ను మిస్ అవ్వకుండా చూడటానికి గల కారణాలు ఇవే
కతిరావన్ మణి ముత్తు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. వీళ్ళు కాలకమ్మపట్టి అనే గ్రామంలో ఉంటారు. అయితే కతిరావన్ అగ్రకులానికి చెందినవాడు. మణి ముత్తు తక్కువ కులానికి చెందినవాడు. అయినా కూడా ఇద్దరి ఫ్రెండ్షిప్ బలంగా ఉంటుంది. ఒకరోజు కతిరావన్ హఠాత్తుగా చనిపోతాడు. దీంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అతను చనిపోయినా కూడా అతని ఒంట్లో నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి. దీంతో అక్కడ అందరూ అతన్ని దేవుడుగా కొలుస్తారు. అక్కడున్న గ్రామస్తులు అతడు మా వర్గానికి చెందిన మనిషి అని పోటీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కతిరావన్ ఫ్రెండ్ మణిముత్తు అతని మరణానికి గల కారణం తెలుసుకుంటూ ఉంటాడు.
అతను మొదట మామూలుగా చనిపోయాడు అనుకుంటారు. ఆ తరువాత గ్రామస్తుల కుట్ర ఉందని, అతన్ని కొంతమంది హత్య చేశారని తెలుస్తుంది. ఇంతలో శవం కూడా కనిపించకుండా పోతుంది. దీంతో గ్రామంలో కుల గొడవలు మొదలవుతాయి. కతిరావన్ ఫ్రెండ్ దీన్ని ఒక కొలిక్కి తేవడానికి ప్రయత్నిస్తాడు. అతని ప్రయత్నం సక్సెస్ అవుతుందా ? కతిరావన్ ని చంపింది ఎవరు? ఎందుకు చంపారు ?అతని ఒంట్లో సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి ? అనే విషయాలను, ఈ తమిళ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.