OTT Movie : రియల్ స్టోరీలతో వస్తున్న డాక్యుమెంటరీలను ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. వీటి వెనుక అసలు నిజాలను తెలుసుకుంటున్నారు. రీసెంట్ గా ఇలాంటి డాక్యుమెంటరీ సిరీస్ లు ఓటీటీలో ట్రెండ్ అవుతున్నాయి. మేకర్స్ కూడా మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ తో వస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ఇలాంటి డాక్యుమెంటరీలను తెరకెక్కించడానికి ఆసక్తిని చూపిస్తున్నాయి. రీసెంట్ గా ‘విక్టోరియా బెక్హామ్’ అనే బ్రిటిష్ డాక్యుమెంటరీ రూపొందింది. ఇది బ్రిటిష్ ఫూట్ బాల్ ప్లేయర్ డేవిడ్ బెక్హామ్ , అతని భార్య విక్టోరియా జీవిత ప్రయానంలోని వివరాలను అందిస్తుంది. ఈ సిరీస్ ఏ ఓటీటీలో ఉంది ? దీని వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.
‘విక్టోరియా బెక్హామ్’ (Victoria Beckham) 2025లో వచ్చిన బ్రిటిష్ డాక్యుమెంటరీ సిరీస్. దీనిని నాడియా హాల్‌గ్రెన్ డైరెక్ట్ చేసింది. 3 ఎపిసోడ్‌లతో వచ్చిన ఈ డాక్యుమెంటరీ 2025 అక్టోబర్ 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతోంది. ఒక్కో ఎపిసోడ్ దాదాపు ముప్పావు గంట నిడివిని కలిగి ఉంటుంది. ఈ డాక్యుమెంటరీ, IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.
డేవిడ్ బెక్హామ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఈ ఆరడుగుల బ్రిటిష్ ఫూట్ బాల్ ప్లేయర్ గ్రౌండ్ లో అడుగుపెడితే స్టేడియం దద్దరిల్లిపోతుంది. అంతగా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఈ ఆటగాడు. పర్సనల్ లైఫ్ లో కూడా అంతే సంచలనం గా మారాడు. పాప్ సింగర్ విక్టోరియాను ప్రేమించి పెళ్లిచేసుకుని వార్తల్లో నిలిచాడు. వీళ్ళకి ఇప్పుడు ముచ్చటగా ముగ్గురు సంతానాం కూడా ఉన్నారు. అయితే వీళ్ళ రియల్ లైఫ్ గురించి ఒక డాక్యుమెంటరీ సిరీస్ ఓటీటీలోకి వచ్చింది. ఇందులో విక్టోరియా పాప్ స్టార్ నుంచి ఫ్యాషన్ డిజైనర్ దాకా ఆమె ప్రయాణాన్ని చూపిస్తుంది. ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కునే ఇబ్బందుల దగ్గరనుంచి, బెక్హామ్ వరకు ఆమె ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీ ఆసక్తికరంగా చూపిస్తుంది. ఆమె ఇంగ్లండ్‌లో మిడిల్ క్లాస్ ఇంట్లో పెరిగింది. ఆ తరువాత ఒక్కో స్టెప్ ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చింది. ప్రస్తుతం ఆమె డేవిడ్, పిల్లలతో హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తోంది. ఈ సిరీస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే, ఈ బ్రిటిష్ డాక్యుమెంటరీ సిరీస్ పై ఓ లుక్ వేయండి.