E-Paper
Advertisement

నయనతార పేట్రియాట్ రిలీజ్ డేట్ లాక్.. సెన్సార్ సమస్యలు తీరినట్టేనా?

నయనతార పేట్రియాట్ రిలీజ్ డేట్ లాక్.. సెన్సార్ సమస్యలు తీరినట్టేనా?
Advertisement

Patriot Movie:సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నయనతార 4 పదుల వయసులో కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూ మంచి విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇక అలాంటి ఈమె తాజాగా నటిస్తున్న చిత్రం పేట్రియాట్. మలయాళం సూపర్ స్టార్స్ మమ్ముట్టి , మోహన్ లాల్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో నయనతార, దర్శనా రాజేంద్రన్, కుంచకో బోబన్, ఫహద్ ఫాజిల్, రాజీవ్ మీనటన్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మహేష్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను క ఆంటో జోసెఫ్ ఫిలిం కంపెనీ , బ్లూ టైగర్స్ లండన్ బ్యానర్లపై ఆంటో జోసెఫ్, కేజీ అనిల్ కుమార్ నిర్మిస్తున్నారు.

సెన్సార్ అభ్యంతరాలు.. రిలీజ్ డేట్ ప్రకటన..

భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కోసం వెళ్లగా సినిమా చూసిన సెన్సార్ బోర్డు ప్రతినిధులు, అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలపై కట్ విధించినట్లు అలాగే సినిమాలోని కొన్ని పాత్రల పేర్లను మార్చాలని సూచించినట్లు సమాచారం. అలాగే కొన్ని సన్నివేశాలను తొలగించాలని ఆంక్షలు విధించారనే విషయం కూడా మాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ పాత్ర విషయంలో సెన్సార్ బోర్డు అధికారులు అభ్యంతరాలు వ్యక్తం చేశారట . ఆ పాత్ర పేరును మార్చాలి అని సెన్సార్ అధికారులు చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా విలన్ పాత్ర పేరు ఒక పొలిటికల్ లీడర్ కుమారుడు పేరు ఒకేలా ఉండడంతోనే సెన్సార్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపోతే సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతోనే చిత్ర బృందం మళ్ళీ మార్పులు, చేర్పులు, తొలగింపులు చేసే ప్రక్రియ మొదలుపెట్టింది. రీ ఎడిట్ చేసే పనిలో నిమగ్నమైంది. దీంతో ఈ సినిమాలో మార్పులు చేసి సెన్సార్ కి తిరిగి సబ్మిట్ చేయనున్నట్లు.. అందుకే రిలీజ్ డేట్ ఆలస్యం అవుతున్నట్లు వార్తలు వినిపించగా.. తాజాగా ఈ మేరకు ఈ సినిమా రిలీజ్ డేట్ నయనతార స్వయంగా ప్రకటించింది.

Advertisement

also read:బాలయ్య ‘సింహ’కు 16 ఏళ్లు.. ఆరేళ్ల విమర్శలకు చెక్.. తెలియని విషయాలెన్నో

పేట్రియాట్ విడుదల రేపే..

ఈ సినిమాను మే 1న అంటే రేపు థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఈ విషయాన్ని నయనతార అధికారికంగా ప్రకటించింది. నయనతార తన లుక్ ను రివీల్ చేస్తూ..” నిరీక్షణ ముగిసింది. తుఫాను మొదలు కాబోతోంది. కేవలం రేపు విడుదల మాత్రమే కాదు.. ఇదొక ఆక్రమణ.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలో చూడడానికి సిద్ధం కండి” అంటూ నయనతార ఈ పోస్టు పంచుకుంది . మొత్తానికి అయితే సెన్సార్ అభ్యంతరాలు చెప్పడంతోనే కాస్త వాయిదా పడిన ఈ సినిమా అన్ని పూర్తి చేసుకొని రేపు థియేటర్లలోకి రాబోతోంది .మరి సెన్సార్ సమస్యలతో ఇబ్బందులు పడ్డ ఈ సినిమా థియేటర్లలో రేపు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇక నయనతార విషయానికొస్తే ప్రస్తుతం వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ బిజీగా మారింది. ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈమె ఇటీవల బాలయ్య ఎన్.బి. కే 111 మూవీ నుండి తప్పుకున్న విషయం తెలిసిందే

Advertisement

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×